ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
TeluguStop.com

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీఈసీ భేటీ అయింది.ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మధు యాష్కీ హాజరయ్యారు.


ఈ సమావేశంలో భాగంగా స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను సీఈసీ పరిశీలించనుంది.


అనంతరం అభ్యర్థుల తొలి జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది.ఈ నేపథ్యంలోనే ఈనెల 15 తరువాత ఏఐసీసీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.
కాగా గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు మరియు స్థానిక పరిస్థితులు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుస్తోంది.
రాజమౌళి కొత్త టార్గెట్ ను సెట్ చేస్తున్నాడా..?