టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు జైల్లో ముప్పు ఉందని ఆయన కోడలు నారా బ్రాహ్మణి అన్నారు.చంద్రబాబును అపరిశుభ్రమైన జైలులో నిర్బంధించడం దారుణమని పేర్కొన్నారు.
ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నారా బ్రాహ్మణి అన్నారు.చంద్రబాబు క్షేమం గురించి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబుకు తక్షణ వైద్య సహాయం అవసరమన్న ఆమె చంద్రబాబు ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నామని తెలిపారు.