టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Director Anil Ravipudi) గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు.ప్రస్తుతం వరుసగా సినిమాలలో తెరకెక్కిస్తూ దూసుకుపోతున్నారు అనిల్ రావిపూడి.
ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.ఇది ఇలా ఉంటే మొదట రచయితగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ ఆ తర్వాత పటాస్( Patas ) సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు.
ఆ తర్వాత అదే జోష్ తో వరుసగా సుప్రీం, రాజా ది గ్రేట్,ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 ఇలా వరుసగా ఆరు సినిమాలు హిట్స్ కొట్టాడు.
ఇకపోతే అనిల్ రావిపూడి బాలయ్య బాబు( Balayya Babu ) తాజాగా హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాకు దర్శకత్వం వహించారు.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా కామెడీగా రాలు తరుకెక్కించగా మొదటిసారి బాలయ్య బాబు కోసం మాస్ బాట పట్టాడు.
తాజాగా ఆదివారం రాత్రి భగవంత్ కేసరి( Bhagwant Kesari ) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది.ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.
ఈవెంట్ కి బాలయ్య అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది వచ్చి సందడి చేశారు.ఈ ఈవెంట్ కి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వంశీ పైడిపల్లి( Vamsi Paidipally ) ఈవెంట్లో మాట్లాడుతూ అనిల్ రావిపూడి గురించి చెబుతూ .
ఎప్పటి నుంచో అనిల్ తెలుసు, చాలా సరదా మనిషి , ఎవరు ఎంత బాధలో ఉన్నా నవ్విస్తాడని, ఇండస్ట్రీలో నాకున్న తమ్ముడు అనిల్ చెప్పి ఎమోషనల్ అయ్యాడు.అలాగే అనిల్ తో పాటు వాళ్ళ నాన్నని కూడా స్టేజిపైకి పిలిచి అందరికి పరిచయం చేశాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి.అనిల్ వాళ్ళ నాన్న ఒక మాములు బస్సు డ్రైవర్.
ఒక మాములు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అనిల్ కష్టపడి ఇవాళ ఎవరూ సాధించలేని విధంగా ఆరు హిట్స్ వరుసగా కొట్టాడు.ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అని అన్నారు.
అలాగే ఇంత డబ్బు సంపాదించినా చాలా సింపుల్ గా ఉంటారు.సరిలేరు నీకెవ్వరు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంటే అనిల్ వాళ్ళ నాన్న రోజు అనిల్ కి ఇంటి నుంచి భోజనం మెట్రోకి LB నగర్ వరకు వచ్చి అక్కడ్నుంచి రామోజీ ఫిలిం సిటీకి తీసుకువచ్చేవాళ్ళు.
ఇవాళ అనిల్ సక్సెస్ అయ్యాడు, ఇంకా సక్సెస్ అవుతాడు అని అభినందించారు.ఒక సాధారణ బస్సు డ్రైవర్ కొడుకు నేడు డైరెక్టర్గా ఎదగడం చాలా గొప్ప విషయం అంటూ నటిజన్స్ అనిల్ పైగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.