నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్ నెలకొంది.కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పనులు పూర్తికాకముందే కాళేశ్వరం ప్యాకేజీ 27ను ప్రారంభించడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ గుండంపల్లిలో పచ్చిని పొలాల మధ్య ఇథనాల్ ప్లాంట్ ను నిర్మించడం సరికాదన్నారు.మరోవైపు గుండంపల్లి వద్ద పలువురు ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది.