నేటి యువత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు.మరీ ముఖ్యంగా కరోనా తరువాత ప్రజలకు ఆరోగ్యం విషయమై పలు నియమాలు పాటిస్తున్నారు.
ఈ క్రమంలోనే వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ అనేదానిని తమ జీవితంలో ఓ భాగం చేసుకున్నారు.అవును, ఇక్కడ చాలామంది ఉదయాన్నే స్విమ్మింగ్ చేయడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నారు.
ఎందుకంటే దాని వలన లాభాలు అనేకం కనుక.ఈ నేపధ్యంలోనే ముంబైలోని( Mumbai ) ఓ స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది కుర్రాళ్ళు చాలా ఉత్సాహంగా ఈత కొడుతుండగా అనుకోకుండా ఓ మొసలి పిల్ల( baby crocodile ) వారి కంట పడింది.
ఇక అంతే, వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఒక్క ఉదుqటున వారు పరుగులంకించారు.
అక్కడ దాదర్‌లోని సెంట్రల్ సబర్బ్‌లో( central suburb of Dadar ) ముంబై పౌర సంస్థ బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంటున్నట్టు సమాచారం.కాగా మహాత్మా గాంధీ జలతరణ్ తలావో( Mahatma Gandhi Jalataran Talao ) అనే ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌ను సభ్యుల కోసం తెరవడానికి ముందు.అంటే అక్టోబర్ 3న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు ఆ మొసలి పిల్లను గమనించి అధికారులకు చెప్పారు.
తరువాత ఈ విషయంపై సమాచారం అందుకున్న వారు నిపుణల సహాయంతో మొసలి పిల్లను క్షేమంగా ఒడ్డికి చేర్చినట్టు అధికారులు తెలిపారు.ఆ తరువాత మొసలి పిల్లను సహజ ఆవాసాలలోకి విడిచిపెట్టడానికి అటవీ శాఖకు అప్పగిస్తున్నట్లు బీఎంసీ తెలిపింది.అయితే స్విమ్మింగ్ పూల్‌లో మొసలి ఎలా చేరిందో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని.దర్యాప్తు ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
కాగా గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని.ప్రైవేట్ జూలోని పాములు రోడ్లపైకి రావడంతో ప్రజలను భయాందోళనకు గురయ్యాని చెబుతున్నారు.