ప్రియురాలిని హత్య చేసి ఆపై ఆత్మహత్య ప్రయత్నం చేసిన ప్రియుడు..!

ఇటీవల కాలంలో నూటికి 90% ప్రేమ వ్యవహారాలు చివరికి తీవ్ర విషాదాన్ని మిగిలిస్తున్నాయి.కేవలం 10 శాతం ప్రేమ వ్యవహారాలు మాత్రమే సుఖమయం అవుతున్నాయి.

 The Boyfriend Who Killed His Girlfriend And Then Tried To Commit Suicide , Jaipu-TeluguStop.com

ఇలా జరగడానికి చాలానే కారణాలు ఉంటాయి.అయితే తాజాగా ఓ ప్రియుడు ప్రాణంగా ప్రేమించిన యువతిను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్( Jaipur ) లో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కిషన్, జ్యోతి లు ప్రేమించుకున్నారు.అయితే ఇరువురి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు.

దీంతో కిషన్ తమ ప్రేమకు చావే పరిష్కారం అని నిర్ణయించుకున్నాడు.

సోమవారం ఈ ప్రేమ జంట లోహమండి అనే ప్రాంతంలో కలుసుకున్నారు.ఎవరూ లేని సమయం చూసి ఓ పదునైన ఆయుధంతో జ్యోతిని హత్య చేశాడు.అనంతరం తాను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

స్థానికులు హర్మాడా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే ఇద్దరూ రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు.

జ్యోతి అప్పటికే మృతిచెందగా.కిషన్( Kishan ) పరిస్థితి విషమంగా ఉంది.వెంటనే పోలీసులు సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు.

కిషన్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమ్మత్ సింగ్ మాట్లాడుతూ.

కిషన్, జ్యోతిలు చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని.ఆ తర్వాత వివాహం కూడా చేసుకుందామని అనుకున్నారని, కానీ వీరి ఇరువురి కుటుంబ సభ్యులు వీరి ప్రేమ పెళ్లికి అభ్యంతరం తెలపడంతో కిషన్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు.

కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube