ప్రియురాలిని హత్య చేసి ఆపై ఆత్మహత్య ప్రయత్నం చేసిన ప్రియుడు..!

ఇటీవల కాలంలో నూటికి 90% ప్రేమ వ్యవహారాలు చివరికి తీవ్ర విషాదాన్ని మిగిలిస్తున్నాయి.

కేవలం 10 శాతం ప్రేమ వ్యవహారాలు మాత్రమే సుఖమయం అవుతున్నాయి.ఇలా జరగడానికి చాలానే కారణాలు ఉంటాయి.

అయితే తాజాగా ఓ ప్రియుడు ప్రాణంగా ప్రేమించిన యువతిను హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్( Jaipur ) లో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కిషన్, జ్యోతి లు ప్రేమించుకున్నారు.అయితే ఇరువురి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు.

దీంతో కిషన్ తమ ప్రేమకు చావే పరిష్కారం అని నిర్ణయించుకున్నాడు. """/" / సోమవారం ఈ ప్రేమ జంట లోహమండి అనే ప్రాంతంలో కలుసుకున్నారు.

ఎవరూ లేని సమయం చూసి ఓ పదునైన ఆయుధంతో జ్యోతిని హత్య చేశాడు.

అనంతరం తాను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.స్థానికులు హర్మాడా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే ఇద్దరూ రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు.

"""/" / జ్యోతి అప్పటికే మృతిచెందగా.కిషన్( Kishan ) పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే పోలీసులు సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రికి తరలించారు.కిషన్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమ్మత్ సింగ్ మాట్లాడుతూ.కిషన్, జ్యోతిలు చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని.

ఆ తర్వాత వివాహం కూడా చేసుకుందామని అనుకున్నారని, కానీ వీరి ఇరువురి కుటుంబ సభ్యులు వీరి ప్రేమ పెళ్లికి అభ్యంతరం తెలపడంతో కిషన్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు.

కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?