స్ట్రెచ్ మార్క్స్( Stretch marks ).మహిళల్లో సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
ఇందుకు ప్రధాన కారణం ప్రెగ్నెన్సీ.అలాగే బరువు పెరిగినా, తగ్గినా కూడా స్ట్రెచ్ మార్క్స్ పడుతుంటాయి.
పొట్ట, కాళ్లు, చేతులు వంటి భాగాల్లో ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి.అయితే స్ట్రెచ్ మార్క్స్ చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా పాడు చేస్తాయి.
అందుకే వాటిని వదిలించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఎన్ని చేసినా స్ట్రెచ్ మార్క్స్ పోవడం లేదని కొందరు బాధపడుతుంటారు.
అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు.
ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అయిన కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు అరటి పండ్లు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడగాలి.
ఆ తర్వాత వాటికి ఉండే తొక్కలను సపరేట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు పాలు పోసుకోవాలి.
అలాగే కట్ చేసి పెట్టుకున్న అరటి పండు తొక్కలు కూడా వేసి ఉడికించాలి.
దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కుక్ చేసి పెట్టుకున్న అరటి పండు తొక్కలను మిల్క్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్రీమ్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond Oil ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.
రోజు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేసుకుని స్మూత్ గా కాసేపు మసాజ్ చేసుకోవాలి.మరసటి రోజు వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్ గా కనుక చేస్తే ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ అయినా దెబ్బకు మాయమవుతాయి.మళ్లీ మీ చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది.