యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Young Rebel Star Prabhas) సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.అన్నీ అనుకున్న విధంగానే జరిగినట్లయితే సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యేది.
కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు వాయిదా అంటూ అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు.
మరో కొత్త డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్”( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.
ఈ క్రమంలోనే ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన సలార్ వాయిదా అంటూ చెప్పి ఆడియెన్స్ కు షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది.
సలార్ అసలు ఈ ఏడాది లోనే రిలీజ్ అవ్వదు అనే వార్తలు రూమర్స్ కాగా ఇప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ తెలుస్తుంది.డిసెంబర్ 22న ఈ సినిమా క్రిస్మస్( Christmas ) కానుకగా రిలీజ్ కాబోతున్నట్టు తెలుస్తుంది.
నీల్ భార్య డిసెంబర్ లో అంటూ పోస్ట్ చేయగా ఇప్పుడు డేట్ కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే డిస్టిబ్యూటర్స్ కు సమాచారం కూడా అందించారని ఈ విషయం సెప్టెంబర్ 29న అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.మొత్తానికి క్రిస్మస్ బరిలో ప్రభాస్ సలార్ తో దిగబోతున్నాడు.ఈ విషయాన్నీ తరన్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి చెప్పడంతో బయటకు వచ్చింది.
కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు.







