ఆర్భాటంగా కలెక్టరేట్ ప్రారంభం సమస్యలతో ఉద్యోగులు ఇబ్బంది...!

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలో ఆగస్టు 22 న సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన సూర్యాపేట నూతన కలెక్టరేట్ లో అప్పుడే కష్టాలు మొదలయ్యాయి.35 శాఖలకు డిజైన్ చేసి నిర్మించి 46 శాఖలకు కేటాయించడంతో అస్తవ్యస్తంగా తయారై ఆఫీసర్లకు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు.కొన్ని గదులను మూడు నుంచి ఐదు డిపార్ట్మెంట్లకు అలాట్ చేయగా ఇక్కడ హెచ్ఓడిలు ఆఫీసర్లు విధులు నిర్వహిస్తుండగా సిబ్బందికి మరో చోట ఛాంబర్ లో ఏర్పాటు చేయటంతో వీరి మధ్య కోఆర్డినేషన్ దెబ్బతింటుంది.దీనికి తోడు విద్యుత్,ఇంటర్నెట్ పనులు ఇంకా కొనసాగుతుండటం, త్రాగునీరు సమస్యతో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగస్తులు భోజనం చేయడానికి,వాష్ చేసుకునేందుకు కూడా బాత్రూంలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొన్నది.

 Employees Are Troubled By The Problems Of The Start Of The Collectorate, Collect-TeluguStop.com

కలెక్టరేట్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చి కేవలం నెలరోజుల్లోనే లోపాలు వెక్కిరిస్తున్నాయి.

కలెక్టరేట్ భవనం రెండో అంతస్తులో స్టేట్ చాంబర్ సమీపంలో ఏర్పాటు చేసిన సీలింగ్ పిఓపి పగిలిపోవడంతో పై భాగంలో పగిలిన పిఓపి నుంచి సమీపంలో గోడల వెంట నీరు కారుతుండగా, నెల రోజులకే వాటర్ పైపులు లీక్ అవడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వర్షం పడిందంటే కలెక్టరేట్ భవనం మొత్తం తడిసి ముద్దవుతుంది.ఇక కలెక్టరేట్ కొచ్చే ఉద్యోగులు సిబ్బంది,ప్రజల వాహనాలకు పార్కింగ్ చేసేందుకు స్థలం కొరత వల్ల రోడ్లపై ఎండలోనే వాహనాలు పార్క్ చేయాల్సిన పరిస్థితి.

రూమ్ నెంబర్ 27 ఒక్క గదినే పార్టిషన్ చేసి ఔషధ తనిఖీ,ఉద్యానవన,ఎస్సీ, మైనార్టీ,గిరిజన,బీసీ,ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో కలిపి మొత్తం 7 శాఖల జిల్లా అధికారులకు ఛాంబర్ లో ఏర్పాటు చేయడం జరిగింది.ఒక్కొక్క రూములో ఒక్కొక్క శాఖ ఉండాల్సింది.

అధికారులు అందరూ ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది.అంతేకాకుండా అధికారులు ఒకచోట సిబ్బంది ఒకచోట ఉండటంతో అంతా అయోమయంగా మారింది.

ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి కలెక్టరేట్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రజలు,సిబ్బంది కూడా కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube