రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై విపక్ష సభ్యులు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2010 లోనే రాజ్యసభలో ఆమోదం పొందిందని ఖర్గే తెలిపారు.మహిళా బిల్లులో ఓబీసీ, ఎస్సీ రిజర్వేషన్లు చేర్చాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.ఈ క్రమంలో ఖర్గే ప్రసంగానికి బీజేపీ సభ్యులు అడ్డు తగిలారు.
బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగిన నేపథ్యంలో రాజ్యసభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.