బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి( Sridevi Kapoor ) టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.తెలుగు లో ఆమెకి ఎంత మంచి పేరు వచ్చిందో, బాలీవుడ్ లో అంతకు పది రెట్లు పేరు వచ్చింది.
ఇండియా లో దాదాపుగా అందరి సూపర్ స్టార్స్ తో కలిసి సినిమాలు చేసిన శ్రీదేవి అంటే నేటి తరం స్టార్ హీరోలకు కూడా ఎంతో ఇష్టం.మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడిగితే ప్రతీ ఒక్కరు శ్రీదేవి పేరే చెప్తారు.
ఆమె చనిపోయే ముందు కూడా ఎంత గ్లామర్ గా ఉండేది.ఇక ఆమె తరం లో ఉన్న హీరోలకు ఆమె పక్కన ఒక్క సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా బాగుండును అని అనుకునేవారు.

నిన్నటి తరం హీరోలలో ఒక్క బాలకృష్ణ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో నటించింది శ్రీదేవి.అయితే ఒక స్టార్ హీరో మాత్రం శ్రీదేవి తో కలిసి నటించడానికి చాలా భయపడ్డాడు అట.ఆయన మరెవరో కాదు , అక్కినేని నాగార్జున( Nagarjuna ).1988 వ సంవత్సరం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఆఖరి పోరాటం‘ అనే సినిమా వచ్చింది.ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్.అయితే ఈ సినిమా శ్రీదేవి పక్కన నటించడానికి నాగార్జున వణికిపోయాడట.ఎందుకంటే ఆయన అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త హీరో.శ్రీదేవి నాగార్జున తండ్రి నాగేశ్వర రావు తో చాలా సినిమాలు చేసింది.
అంత పెద్ద హీరోయిన్ తో సినిమా అంటే, ఆమె నటన ముందు నేను నిలుస్తానా లేదా అనే భయం ఉండేది.కానీ ఆమెతో రెండవ సినిమా చేసేటప్పుడు మాత్రం ఆ భయం ఉండేది కాదు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు వచ్చాయి, అందులో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి.తెలుగు లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో శ్రీదేవి నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘గోవిందా గోవిందా ( Govinda Govinda )’ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి కానీ, బాక్స్ ఆఫీస్ ఎందుకో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.‘ఆఖరి పోరాటం’ తర్వాత అమితాబ్ బచ్చన్ మరియు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ‘ఖుదా గవా’, అలాగే అనిల్ కపూర్ మరియు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బేచేరా వంటి సినిమాల్లో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.వీటి తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు.