బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) తాజాగా నటించిన చిత్రం జవాన్( Jawan ).కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ పాజిటివ్ స్పందనను దక్కించుకుంది.
ఇకపోతే ఈ సినిమాలో హీరో షారుఖ్ ఖాన్ తల్లి పాత్రలో రిధి డోగ్రా( Ridhi Dogra ) నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రిధి డోగ్రా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.సినిమాలో ఆ రోల్ కి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంది.మూవీలో షారుఖ్ తల్లిగా నటించేందుకు ముందుగా ఆసక్తి చూపకపోయినా తర్వాత అంగీకరించాను ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… డైరెక్టర్ అట్లీ( Director Atlee ) అర్జంట్‌గా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అంటూ 2022 జూన్‌లో నాకు ఫోన్‌కాల్ వచ్చింది.అయితే మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను.
కానీ, ఆయనతో మాట్లాడిన తర్వాత భయం పోయింది.ఆయన చాలా స్వీట్ పర్సన్.
నా పాత్ర గురించి వివరించగా నేను బాగా ఆలోచించి నో చెప్పాను.
ఎందుకంటే షారుక్ అంటే నాకు బాగా ఇష్టం.తెరపైనైనా ఆయనకు తల్లిగా కనిపించాలంటే మనసు అంగీకరించలేదు.కొన్ని రోజుల తర్వాత అట్లీతో మళ్లీ చర్చలు జరిగాయి.
ఆ సమయంలో కథ, ఆయా పాత్రలపై ఆయనకున్న స్పష్టత చూసి నేను కన్విన్స్ అయ్యాను. మదర్ రోల్( Shah Rukh Mother Role )ను సవాలుగా స్వీకరించి ముందడుగు వేసాను.
నా వరకు ఇది పెద్ద రిస్క్.అయితే, చిత్రీకరణ జరిగినన్ని రోజులు నేను సరైన నిర్ణయమే తీసుకున్నానా? అనే సందేహం వెంటాడేది.అలానే నటించాను.కానీ, ఔట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది.అట్లీ నా క్యారెక్టను తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంది.నాతో కలిసి మళ్లీ నటించాలనుందని షారుక్ ఒక వేదికపై చెప్పడం నా జీవితంలో పెద్ద ప్రశంస అని రిధి డోగ్రా చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.