తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) చేసే సినిమాల శైలి వేరేగా ఉంటుంది అనేది మనం ఖచ్చితం గా చెప్పవచ్చు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు నాకు తెలిసి మన ఇండియా లో ఎవరు చేయలేరు సినిమా సినిమా కి ఒక సెపరేట్ వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటిస్తూ సినిమా సినిమా కి తనని తాను చాలా గొప్ప గా ప్రెసెంట్ చేసుకుంటాడు.
ఎంతటి క్యారెక్టర్ అయిన సరే అది ఎంత కష్టం అయిన దాని కోసం ఏదైనా చేస్తాడు అలాంటి కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2( Indian 2 ) సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ఆయన అప్పుడెప్పుడో చేసిన భారతీయుడు సినిమా కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తున్న విషయం మనకు తెలిసిందే.

భారతీయుడు సినిమా అటు తమిళ్ ఇటు తెలుగు రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది… అయితే ఇప్పుడు తీస్తున్నా ఇండియన్ 2 సినిమా మీద కూడా జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా విషయంలో కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ తో గొడవ పెట్టుకున్నాడట అందుకే ఈ సినిమా చాలా రోజుల నుంచి షూటింగ్ జరగకుండ అలాగే వదిలేశారట అయితే మళ్ళీ వీళ్లిద్దరి మధ్య కి ప్రొడ్యూసర్ వచ్చి ఆ గొడవను కాంప్రమైజ్ చేయడం తో వీళ్ళ మధ్య జరిగిన గొడవ ని మర్చిపోయి ఇద్దరు మళ్ళీ షూటింగ్ కి వచ్చారట…

అయితే వీళ్ళకి గొడవ ఇప్పుడు అనే కాదు మొదట శంకర్ రోబో సినిమా( Robo Movie )ని షారుఖ్ ఖాన్ తో చేద్దాం అనుకున్నాడు,కానీ ఆయన వద్దు అనడం తో కమల్ హాసన్ తో చేయాలి అనుకున్నాడు ఇక కమల్ కి తనకి గొడవ జరగడంతో ఆ ప్రాజెక్ట్ రజినీకాంత్ దగ్గరికి వెళ్ళింది…మొత్తానికి ఆ సినిమా రజిని తో తీసి శంకర్ సూపర్ హిట్ కొట్టాడు అయితే ఇప్పుడు తీస్తున్న ఇండియన్ 2 సినిమా విషయం లో ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి జరుగుతూనే ఉంది అందుకే ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు… లోకనాయుకుడు కమల్ కి శంకర్ కి తరుచుగా ఇలా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎవ్వరికీ తెలీదు…
.