తెలుగుదేశానికి ఊ పిరిలూదిన జగన్ ?

ఎవరు ఊహించని విధంగా జగన్ ప్రభుత్వం( Jagan ) తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.చంద్రబాబు అరెస్టుపై గత కొన్ని రోజుల నుంచి లీకులు అందుతున్నప్పటికీ ఒక పార్టీ అధినేతను ఇంత సింపుల్ గా అరెస్ట్ చేసే సాహసం ప్రభుత్వం చేయ్యదనే ఉద్దేశంతోనే చాలామంది ఉన్నారు.

 Jagan Gave Oxigen To Tdp , Jagan , Tdp , Md Radakrishna, Chandrababu , Ap Cid,-TeluguStop.com

ఐతే అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ చంద్రబాబును ( Chandrababu )కస్టడీ లోకి తీసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలుఒక్క సారిగా హీటెక్కాయి తెలుగుదేశం శ్రేణుల నిరసన కార్యక్రమాలు, మద్దతు తెలపడానికి వస్తున్న జనసేన అధ్యక్షుడిని మార్గమధ్యలో అడ్డుకోవడానికి చూడటం వంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు హాట్ డిబేట్ గా మారాయి .

Telugu Ap Cid, Chandrababu, Jagan, Jagangave, Md Radakrishna-Telugu Political Ne

మినిట్ టూ మినిట్ కొత్త అప్డేట్ లను ఇస్తున్న మీడియా ఇరు పార్టీల కార్యకర్తలకు నిద్రలేని రాత్రి మిగిలించిది .అయితే ఎన్నికలకు దగ్గరగా ఉన్న ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం రాజకీయంగా జగన్ కు గట్టి ఎదురుదెబ్బ అని తెలుగుదేశం అనుకూల మీడియాతో పాటు తటస్థ రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు చంద్రబాబును బాధ్యుడిని చేయడం అన్నది ఇంతకుముందు కూడా అనేక కేసుల్లో నిలబడలేదని , అక్రమస్తుల కేసులు ఏపీ సిఐడి ( AP CID )పరిధి కాదు అని అవినీతి శాఖ అధికారులు మాత్రమే విచారించాలని, ఇంతకుముందుఇలాంటి కేసుల్లో స్పష్టమైన తీర్పులు ఉన్నా కూడా ఏపీ సిఐడి దూకుడుగా వెళుతుందని దానికి కోర్టులో చివాట్లు తప్ప వంటూ ఆంధ్రజ్యోతి ఎండి రాదకృష్ణ ( MD Radakrishna ) ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో వీక్ ఎండ్ కామెంట్ చేశారు.

Telugu Ap Cid, Chandrababu, Jagan, Jagangave, Md Radakrishna-Telugu Political Ne

మరో పక్క చంద్రబాబు వయస్సు దృష్ట్యా ఆయన ని అదుపులోకి తీసుకున్న విధానం కానీ ఆయనను తరలిస్తున్న విధానం కానీ తెలుగు ప్రజలలో ఆయనకు సింపతిని పెంచే విధంగానే పరిణామాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది .దేశవ్యాప్తంగా సీనియర్ రాజకీయ నాయకులలో చంద్రబాబు ఒకరు .అలాంటి వ్యక్తి విషయంలో పోలీస్ శాఖ కొంత స్మూత్ గా వ్యవహరించి ఉంటే బాగుండేది అన్న విశ్లేషణలు ఉన్నాయి.రాజకీయ అధికారం కన్నా ప్రతీకరమే తనకు ప్రయారిటీ అని జగన్ చెప్పదలుచుకున్నారా అన్నట్లుగా పరిణామాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది .మరి ఈ పరిణామాలకు జగన్ ప్రభుత్వం చెల్లించే మూల్యం ఎలాంటిదో వేచి చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube