చంద్రునిపై భూమిని కొనుగోలు చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలిసిందే.దీంతో అప్పటినుంచి చంద్రుడిపై భూములను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తున్నారు.

 Landon The Moon By Paying 55 Lakhs , Sushanth Singh Rajput, Shahrukh Khan, Bolly-TeluguStop.com

ఈ లిస్టులో సెలబ్రిటీలు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఉన్నారు.అయితే చంద్ర‌యాన్ 3 విజ‌యంతో చంద‌మామ‌పై కాల‌నీలు నిర్మించుకోవ‌చ్చ‌ని ఇస్రో ఛైర్మ‌న్( ISRO ) వ్యాఖ్యానించ‌డంతో ఇప్పుడు ప్ర‌జ‌లంతా దానిపై దృష్టి సారించారు.

ఇప్ప‌టికే చంద‌మామ‌పై భూమిని కొనుక్కున్న ఇద్ద‌రు స్టార్ హీరోలు మ‌న‌కు ఉన్నార‌నేది ఎవ‌రికైనా తెలుసా? ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కాగా ఇప్పటికే ఆ హీరోల పేరుతో చంద్రునిపై భూమి రిజిస్ట‌ర్ అయి ఉంది.

అందులో ఒక‌రు షారుఖ్ ఖాన్( Shahrukh Khan ), మ‌రొక‌రు దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్( Sushant Singh Rajput ).

Telugu Bollywood, Moon, Shahrukh Khan, Sushanthsingh-Movie

2009లో ఒక ఆస్ట్రేలియన్ మహిళ చంద్రునిపై తన కోసం ప్రతి సంవత్సరం ఒక భూమిని కొనుగోలు చేస్తోందని SRK ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు.చంద్రుడిపై అత‌డు సొంతం చేసుకున్న‌ భూమి ఉన్న ప్రాంతాన్ని ప్రశాంత‌ సముద్రం అంటార‌ని తెలిపారు.నిజానికి చంద‌మామ‌పై ఒక 01 ఎకరం సుమారు 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్లు కొనుగోలుకు 37.50 అమెరిక‌న్ డాల‌ర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1758.75 ఖర్చవుతుందని కథనాలు వినిపించాయి.అయితే ప్ర‌ముఖ మీడియాతో SRK మాట్లాడుతూ.

చంద‌మామ‌పై త‌న ఆస్తుల గురించి ఇలా వెల్లడించారు.ఒక ఆస్ట్రేలియన్ మహిళ ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున నా కోసం చంద్రునిపై కొద్దిగా భూమిని కొనుగోలు చేస్తుంది.

ఆమె కొంతకాలంగా దీన్ని కొనుగోలు చేస్తోంది.నేను లూనార్ రిపబ్లిక్ సొసైటీ ( Lunar Republic Society )నుండి ఈ సర్టిఫికేట్‌లను పొందాను.

ఆమె నాకు రంగురంగుల ఇమెయిల్‌ లను రాస్తుంది.ఒక లైన్ ఎరుపు, ఒకటి నీలం ఇలా రంగురంగుల మెయిల్స్ వ‌స్తాయని షారుఖ్ ఖాన్ తెలిపారు.

Telugu Bollywood, Moon, Shahrukh Khan, Sushanthsingh-Movie

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజల ప్రేమను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఖాన్ తెలిపారు.అలాగే SRK ఆస్ట్రేలియ‌న్ అభిమాని చంద‌మామ‌పై భూమిని కొనుగోలు చేస్తున్న విష‌యాన్ని ఒక ఇంట‌ర్వ్యూలో ఒప్పుకున్నారు.అవును, నేను కింగ్ ఖాన్ కోసం చంద్రునిపై ఒక బ్లాక్ భూమిని కొనుగోలు చేసాను.ఎందుకంటే చంద్రుడిపై భూమిని సొంతం చేసుకున్న‌ మొదటి హిందీ సినిమా హీరో షారూఖ్ మాత్ర‌మే కావాలని కోరుకున్నాను.

షారుఖ్ ఎల్లప్పుడూ ప్రతిదానిలో మొదటి స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని సదరు అభిమాని వెల్లడించారు. 2002లో షారూఖ్‌ పుట్టినరోజు సందర్భంగా నేను అతని పేరు మీద స్కార్పియస్ రాశిలో ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసానని చెప్పుకొచ్చారు.

సుశాంత్ సింగ్ ఫిజిక్స్ ని అమితంగా ప్రేమించే విద్యార్థి.అత‌డు చంద్రునిపై ఆస్తిని కొనుక్కున్నాడు.చంద‌మామపై ఆస్తిని కొనుగోలు చేసిన ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్( Mare Muscovians ) లేదా సీ ఆఫ్ ముస్కోవి అని పిలుస్తారు.దీనికి దివంగత నటుడు సుశాంత్ చెల్లించిన ధర దాదాపు రూ.55 లక్షలు.సుశాంత్ వ‌ద్ద త‌న ఆస్తిని చెక్ చేసుకునేందుకు భారీ టెలిస్కోప్ కూడా ఉంది.

దానితో అత‌డు చంద‌మామ‌పై తన ఆస్తిని పదే పదే తనిఖీ చేసేవాడు.ఏక్తా కపూర్ టీవీ సిరీస్ పవిత్ర రిష్టా బ‌యోపిక్ డ్రామా ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ లో సుశాంత్ న‌టించాడు.14 జూన్ 2020న అత‌డు అనుమానాస్పదంగా త‌న ఇంటి గ‌దిలో మరణించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube