ప్రోద్దు తిరుగుడు సాగులో అధిక దిగుబడి కోసం ఎరువుల యాజమాన్యం..!

ప్రోద్దు తిరుగుడు( Sunflower ) నూనె గింజల పంటలలో ప్రధానమైన పంట.మిగతా నూనె గింజల పంటలతో పోలిస్తే ఈ పంటలో నూనె శాతం అధికంగా ఉండడం వల్ల రైతులు ప్రోద్దు తిరుగుడు పంట సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.

 Ownership Of Fertilizers For High Yield In Sunflower Cultivation, Sunflower Cu-TeluguStop.com

ప్రోద్దు తిరుగుడు పంటలో మేలైన ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.ఈ పంట సాగుకు రేగడి, ఒండ్రు, ఎర్ర చల్క నేలలు అనుకూలంగా ఉంటాయి.

తేలికపాటి నేలలో అయితే జూలై చివరి వరకు, బరువైన నేలలలో అయితే ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకునే అవకాశం ఉంది.

Telugu Agriculture, Alluvial Soils, Borax, Farmers, Gypsum, Latest Telugu, Regad

వేసవికాలంలో ముందుగా నేలను మూడు లేదా నాలుగు సార్లు లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు మూడు టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి.విత్తే సమయంలో ఒక ఎకరం పొలంలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్,( super phosphate, ) 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసుకోవాలి.

ఒక ఎకరం పొలానికి రెండు కిలోల విత్తనాలు అవసరం.వర్షాధారంగా సాగు చేస్తే విత్తనాలు తొందరగా మొలకెత్తడం కోసం ఒక లీటరు నీటిలో ఒక కిలో విత్తనాలు చొప్పున 14 గంటల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత నీడలో ఆరబెట్టి, కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

Telugu Agriculture, Alluvial Soils, Borax, Farmers, Gypsum, Latest Telugu, Regad

మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.విత్తిన 15 రోజుల తర్వాత ఆరోగ్యమైన మొక్కలను ఉంచి మిగతా మొక్కలను పొలం నుంచి తొలగించాలి.ఇలా చేయడం వల్ల మొక్కలకు నీటితోపాటు ఎరువులు సంపూర్ణంగా అందుతాయి.విత్తిన 30 రోజులకు ఒకసారి, 50 రోజులకు మరోసారి ఒక ఎకరాకు 13 కిలోల చొప్పున యూరియాను అందించినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి.

ఒక ఎకరాకు గంధకాన్ని జిప్సం( Gypsum ) రూపంలో 10 కిలోలు అందించినట్లయితే గింజలలో నూనె శాతం పెరుగుతుంది.పూత దశలో ఉన్నప్పుడు ఒక లీటర్ నీటిలో రెండు గ్రాముల బోరాక్స్ ను కలిపి పిచికారి చేస్తే గింజలలో తాలు శాతం తగ్గి బాగా వృద్ధి చెందుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube