స్వదేశానికి అమెరికాలో భారత రాయబారి .. అమృత్‌సర్‌లో తాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న తరంజిత్ సింగ్

అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు( Taranjit Singh Sandhu ) భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా పంజాబ్‌లోని పింగళ్వార ఛారిటబుల్ సొసైటీని సందర్శించి, వారు చేస్తున్న కార్యక్రమాలను గమనించారు.

 Indian Envoy To Us Taranjit Singh Sandhu Visits Golden Temple, Pingalwara In Amr-TeluguStop.com

అలాగే సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని , గురుద్వారా బాబా దీప్ సింగ్ షాహిద్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.జూన్‌లో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో రోలర్ స్కేటింగ్ ఈవెంట్‌లలో నాలుగు పతకాలు సాధించిన పింగళ్వారకు చెందిన స్కేటర్లు మహ్మద్ నిసార, సీత, రేణుకలతో తరంజిత్ ముచ్చటించారు.

Telugu Amritsar, Golden Temple, Pingalwara, Taranjitsingh, Tejasingh-Telugu NRI

మనవాలాలోని పింగళ్వార సేవా కేంద్రంలోని( Pingalwara Service Centre ) ప్రతివార్డును ఆయన సందర్శించారు.వికలాంగుల వార్డు, బధిరుల పాఠశాల, ప్రత్యేక పాఠశాల, ఫిజియోథెరపీ కేంద్రాలను పరిశీలించారు.అలాగే ఇక్కడ నిర్వహిస్తున్న బేకరీని కూడా తరంజిత్ సింగ్ సంధు పరిశీలించారు.అంతకుముందు పింగళ్వార ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయానికి వచ్చిన భారత రాయబారికి సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ ఇందర్‌జిత్ కౌర్ ( Dr.Inderjit Kaur )స్వాగతం పలికారు.సొసైటీని స్థాపించిన భగత్ పురాణ్ సింగ్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఆమె తరంజిత్‌కు చూపించారు.

Telugu Amritsar, Golden Temple, Pingalwara, Taranjitsingh, Tejasingh-Telugu NRI

స్వర్ణ దేవాలయ సందర్శన సందర్భంగా ఆయన తన తాత పేరు పెట్టిన తేజ సింగ్ సముంద్రి( Teja Singh Samundri ) హాల్‌ను సందర్శించారు.ఇది శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యాలయం హాలులో వుంది.ఈ సందర్భంగా తరంజిత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.ఆధ్మాత్మిక శక్తిని పెంపొందించే గోల్డెన్ టెంపుల్ మానవాళికి విశ్వాస కేంద్రమన్నారు.ఎస్‌జీపీసీ ఏర్పాటు కోసం తన తాతయ్య అనేక ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు.ప్రస్తుతకాలం సాంకేతిక యుగం అని.సిక్కు సమాజం కూడా విద్యార్ధులను సాంకేతిక విద్యలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేయాలని తరంజిత్ పిలుపునిచ్చారు.కాగా.

భారత్ , అమెరికాల మధ్య సంబంధాల బలోపేతానికి తరంజిత్ కృషి చేస్తున్నారు.ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలకు , చర్చలకు, కార్యక్రమాలకు తరంజిత్ సింగ్ సాక్ష్యంగా నిలిచారు.

కరోనా మహమ్మారి సమయంలో అమెరికా నుంచి సాయం అందడంలోనూ, భారత వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన సాయం దక్కడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube