తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు.
ఆ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.60 శాతం మంది రైతులకు డబ్బులు పడలేదని విమర్శలు గుప్పించారు.దళితబంధును బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.ఈ క్రమంలో దళితులు ఎవరూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని సూచించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏమి లేదన్న ఆయన ఈసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.