హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది.ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తుంది.
ఈ మేరకు నేతలు పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల వ్యవహారాల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మరియు ఈటల రాజేందర్ తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇందులో భాగంగా 40 మందితో తొలి జాబితాను బీజేపీ నేతలు సిద్ధం చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.అదేవిధంగా ఇతర పార్టీల నేతలను పార్టీలోకి తీసుకురావడంపై చర్చిస్తున్నారు.
అయితే సమావేశం వివరాలను గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తోంది.