1.మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
2.కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న

తెలంగాణ కాంగ్రెస్ లో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేరారు.ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.
3.అమిత్ షాకు తప్పిన ప్రమాదం
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతుండగా , ప్రచార రథం విద్యుత్ వైర్లను తాకింది.దీంతో విద్యుత్ వైర్ తెగిపడింది.వెంటనే అప్రమత్తమైన నేతలు అమిత్ షా వాహనం తో పాటు మిగతా వాహనాలను ఆపేశారు.విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
4.హైకోర్టులో రఘురామ ఫిల్

ఏపీలో ఆర్థిక కుంభ కోణాలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై బుధవారం హైకోర్టులు విచారణ జరిగింది. ఈ ఫీల్ పై నాట్ బిఫోర్ మీ అని ధర్మసనంలోని న్యాయమూర్తి అన్నారు.
5.లోకేష్ విమర్శలు
సైకో కళ్ళలో ఆనందం కోసమే తప్పుడు కేసులు పెడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
6.విజయ్ సాయి రెడ్డి పై బిజెపి విమర్శలు

వైసిపి నాయకులు దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారని బిజెపి అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ విమర్శించారు.వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువింద గింజ మాటలు మానుకోవాలని సూచించారు.
7.తెలంగాణ ఎన్నికల బందోబస్తు తమిళ పోలీసులు
తెలంగాణ ఎన్నికల భద్రత విధులు చేపట్టేందుకు 5000 మంది పోలీసులను పంపించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు.దీంతో ఈనెల 27వ తేదీ తెలంగాణకు తమిళ పోలీసులు బందోబస్తుకు రానున్నారు.
8.విశాఖ ఉక్కు ఉద్యమానికి వెయ్యి రోజులు

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తూ తీసుకున్న నిర్ణయం ను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమం నేటికి వెయ్యి రోజులకు చేరుకుంది.
9.వెంకయ్య నాయుడు కామెంట్స్
ఎన్నికల హామీల్లో ఉచితలకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
10.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్

కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్కమ్ టాక్స్, ఈడి దాడులు జరగబోతున్నాయని కాంగ్రెస్ పార్టీపై కక్షగట్టి బిజెపి ఈ దాడులకు దిగబోతోంది అని ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
11.కూకట్ పల్లి జనసేన అభ్యర్థిగా ప్రేమ కుమార్
కూకట్పల్లి జనసేన అభ్యర్థిగా ప్రేమ కుమార్ పేరును ప్రకటించారు.
12.వైయస్ షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నాం

తెలంగాణ ప్రజలను మోసం చేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, వైఎస్ షర్మిలను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామని , ఆమె ఇక్కడ అవసరం లేదని ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న గట్టు రామచంద్రరావు అన్నారు.
13.దిశా యాప్ పేరుతో ఏదో మోసం
దిశ చట్టంకు దిక్కూ మొక్కు లేదని , మహిళల భద్రత అంటూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
14.కిషన్ రెడ్డి విమర్శలు

ఈటెల రాజేందర్ ను చూసి కేసీఆర్ కామారెడ్డి పారిపోయారని , గజ్వేల్ , కామారెడ్డి రెండు చోట్ల కేసీఆర్ ఓటమి ఖాయమని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
15.హరీష్ రావు విమర్శలు
టిక్కెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ వాళ్లు రేపు రాష్ట్రాన్ని అమ్ముకోరా అని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
16.కమిషన్ల కోసమే కాలేశ్వరం

కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే సీఎం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును కట్టారని బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
17.జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.జగన్ అక్రమాస్తుల కేసులు పై మాజీ ఎంపీ హరి రామ జోగయ్య వేసిన ఫీల్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.
18.చంద్రబాబు ర్యాలీపై ఎన్ హెచ్ ఆర్ సి లో కేసు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోసం హైదరాబాద్ లో నిర్వహించిన ర్యాలీపై ఎన్ హెచ్ ఆర్ సి లో కేసు నమోదు అయింది.స్కిల్ కేసులో జైలు నుంచి విడుదలైన బాబును హైదరాబాద్ తీసుకువచ్చే క్రమంలో టిడిపి శ్రేణులు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి భారీ ర్యాలీ నిర్వహించారు.
19.పురందరేశ్వరపై విజయ్ సాయి రెడ్డి విమర్శలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శలు చేశారు.చెల్లెమ్మా పురందరేశ్వరి కన్నతండ్రి ఎన్టీఆర్ ఎంతో కష్టపడి సాధించుకున్న అధికారాన్ని భర్త ,బావలతో చేతులు కలిపి నిర్దాక్షిణ్యంగా లాగి పడేసావు నీవు ఏం కూతురివమ్మ అంటూ మండిపడ్డారు.
20.పోసాని కృష్ణ మురళి విమర్శలు

టిడిపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పై వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి విమర్శలు చేశారు. సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల విషయాన్ని ప్రస్తావించి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేంద్ర మంత్రిగా ఉన్న పురందరేశ్వరి తమ్ముడు బాలకృష్ణ ను కాపాడింది నిజం కాదా అని ప్రశ్నించారు.