ఈ ఫేక్ పాస్ పోర్ట్ వెబ్ సైట్లు గురించి తెలిసిందా?

ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు విదేశాలు వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.అది ఏడాది ఏడాదికి పెరుగుతూ వస్తోంది.

 Be Aware Of These Fake Passport Websites Details, Fake Passport, Report, Website-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫేక్ పాస్ పోర్ట్ వెబ్ సైట్లు( Fake Passport Websites ) పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి.అందుకే ఫేక్‌ పాస్‌ పోర్ట్‌ వెబ్‌సైట్లపై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.

ఆయా వెబ్‌ సైట్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు నిక్కచ్చిగా చెప్పింది.ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫామ్స్, అపాయింట్‌ మెంట్‌ షెడ్యూలింగ్‌కు సంబంధించిన సేవలు అందిస్తామంటూ కొన్ని వెబ్‌సైట్లు, యాప్స్‌ జనాన్ని పెద్దఎత్తులో మోసం చేస్తున్నాయని తెలిపింది.

అలాంటి వాటిని నమ్మవద్దని స్పష్టం చేసింది.కేవలం భారత విదేశాంగ శాఖ తన అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించిందని కేంద్రం చెప్పింది.

అవును, ఇపుడు www.passportindia.gov.in వెబ్‌ సైట్‌ మాత్రమే దేశవ్యాప్తంగా పాస్‌ పోర్ట్‌ సర్వీసులు అందిస్తోంది.

1.నకిలీ వెబ్‌సైట్‌: www.indiapassport.org

వెబ్‌సైట్‌ సస్పెండ్‌ చేయబడింది.కానీ ఇది ఇతర డొమైన్‌ పేర్లతో మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Telugu Central, Passport, Latest, Passport Sevain, Care, Website-Latest News - T

2.నకిలీ వెబ్‌సైట్‌: www.indiapassport.org

ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన మరో వెబ్‌సైట్‌ ఇది.దీనిని ఓపెన్ చేసాక సైట్‌ ఓటర్‌ కార్డ్‌ తో సహా( Voter Card ) బహుళ ఆన్ లైన్‌ అప్లికేషన్‌ నింపమని అడుగుతుంది.పాస్‌పోర్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల నుంచి సున్నితమైన సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తుంది.

3.నకిలీ వెబ్‌సైట్‌: www.passportindiaportal.in

పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులను ప్రభుత్వం హెచ్చరించే మరో నకిలీ వెబ్‌సైట్‌( Fake Website ) ఇది.హోమ్‌ పేజీలో పలు సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది.కానీ ఇది కూడా పూర్తిగా మోసపూరితమైనది.

4.నకిలీ వెబ్‌సైట్‌: www.passport-india.in

ఈ నిర్దిష్ట వెబ్‌సైట్‌కు సంబంధించి భారతీయ పాస్‌పోర్ట్‌ అథారిటీ( India Passport Authority ) ఒక హెచ్చరిక సలహాను జారీ చేసిందని గమనించండి.పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులు ఈ వెబ్‌సైట్‌తో ఎటువంటి పరస్పర చర్యలను చేసినా అవి నిరుపయోగమే.

Telugu Central, Passport, Latest, Passport Sevain, Care, Website-Latest News - T

5.నకిలీ వెబ్‌సైట్‌: www.passport-seva.in

ఈ వెబ్‌సైట్‌ కూడా పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులను మోసం చేయడానికే పుట్టింది.‘in’ డొమైన్‌తో ఇది భారత ప్రభుత్వ పాస్‌పోర్ట్‌ వెబ్‌సైట్‌గా మారుమోగుతుంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త!

6.నకిలీ వెబ్‌సైట్‌: www.applypassport.org

ఈ జాబితాలోని రెండవ ‘.org’ వెబ్‌సైట్, ఇదికూడా ఓ నకిలీ పాస్‌పోర్ట్‌ వెబ్‌సైట్.ఈ సైట్ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులను హెచ్చరించింది కూడా.ఇంకా మీరెన్నో వున్నాయి.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వాటిని వెతుక్కొని పనిలో పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube