నిన్న చంద్రబాబు( Chandrababu Naidu ) 2047 ఒక డాక్యుమెంట్ ఇచ్చారు విజన్ 2047 పేరు తో తెలుగు ప్రజల్ని ప్రపంచ పటం లో పెడతాడట.చంద్రబాబు.
భవిష్యత్ విద్యుత్ దే అని రేట్లు తగ్గిస్తా అని బాబు చెప్తున్నారు.గతంలో విద్యుత్ చార్జీలు తగ్గించమంటే లాఠీ చార్జీ చేయించిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ చార్జీలు తగ్గిస్తా అంటున్నాడు….
విజన్ 2020 లో వ్యవసాయం తగ్గించేస్తా అని బాబు చెప్పాడు.
ఎన్టీఆర్( NTR ) గొప్ప నాయకుడు అంటున్నాడు బాబు.
మరి ఎందుకు కూల్చారు….ఇరిగేషన్ పై బాబు కు ఉన్న విజన్ ఏంటి …ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు…ఏది పూర్తి చేశాడు.
కనీసం పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చంద్రబాబు చెప్పాలి.కనీసం కుప్పానికి అయిన నీళ్లు ఇచ్చారా చంద్రబాబు……అసలు చంద్రబాబు వయసు ఏంటి…2047 ఏంటి….
అసలు ఏమైనా అర్ధం అయ్యే చెప్తున్నారా.చంద్రబాబు పధకం అంటే ఠక్కున గుర్తొచ్చేది పబ్లిసిటీ నే…అదొక్కటే ఆయన చెయ్యగలరు కనీసం నారా వారి పల్లె గవర్నమెంట్ బడి బాగు చేద్దామన్న విజన్ చంద్రబాబు కు ఉందా….
నారాయణా కాలేజి కి ప్రభుత్వ బడుల యాజమాన్యం అప్పగించాడు చంద్రబాబు….
ప్రభుత్వ ఆసుపత్రుల్లో( Government hospitals ) యూజర్ చార్జీల మోత మోగించాడు చంద్రబాబు.
ఇది ఆయన విజన్.ప్రతి పనికి యూజర్ చార్జీలు వసూలు చేసాడు చంద్రబాబు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్స్ రే లు ఒపి లు అన్నిటికీ యూజర్ చార్జీలు చంద్రబాబు వసూల్ చేసాడు…ఇవాళ ఏపీ లో వైద్య ఆరోగ్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి.అంబులెన్స్ లు వచ్చాయి.