ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడింది.అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై పూర్తిగా దృష్టి సారించాయి.
ప్రజల్లో బలం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.వైసిపి, టిడిపి, జనసేనలు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి.
సమావేశాలు పేరుతో హడావుడి చేస్తున్నాయి.దీంతో ఈసారి ఏపీలో అధికారం ఏ పార్టీకి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
అధికార పార్టీ వైసీపీ( YCP ) మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మళ్ళీ అధికార పీఠంపై కూర్చోబెడతాయనే నమ్మకంతో ఉండగా, టిడిపి జనసేన లు మాత్రం వైసిపి పై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని, అదే తమకు అధికారం తెచ్చిపెడుతుందని టిడిపి ,( TDP ) జనసేన( Janasena ) రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తూ ఉండడంతో, కచ్చితంగా గెలుపు తమదే అన్న లెక్కల్లో ఉన్నారు.ఇది ఇలా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అసలు ఈ మూడు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది ? ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది ఒకసారి పరిశీలిస్తే… ఉత్తరాంధ్రలో( Uttarandhra ) మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
![Telugu Ap Assembly, Ap, Chandrababu, Cm Jagan, Jagan, Janasena, Janasenatdp, Jan Telugu Ap Assembly, Ap, Chandrababu, Cm Jagan, Jagan, Janasena, Janasenatdp, Jan](https://telugustop.com/wp-content/uploads/2024/02/ycp-tdp-janasena-chances-of-winning-in-Uttarandhra-detailss.jpg)
2019 ఎన్నికల్లో వైసిపి 28 స్థానాల్లో గెలుపొందింది.టిడిపి ఆరు స్థానాలను గెలుచుకుంది.అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం పోరు హారహోరేగా ఉండేలా కనిపిస్తోంది.ఉత్తరాంధ్రలో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam District ) వైసిపి, టిడిపి జనసేన కూటమి మధ్య గట్టి పోటీ వాతావరణం కనిపిస్తుంది.తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం ,టెక్కలి, పాతపట్నం ,శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆముదాలవలస, పాలకొండ, రాజాం నియోజకవర్గల్లో కాస్త సానుకూలత ఉన్నట్టుగా కనిపిస్తోంది.
నరసన్నపేట లో( Narasannapeta ) వైసీపీకి అనుకూలంగా ఉన్నట్లుగా అనేక సర్వేల్లో తేలింది.పలాసలో గట్టి పోటీ నడిచే అవకాశం ఉంది.
శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి( MP Ram Mohan Naidu ) గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా సర్వేల్లో తేలింది.
![Telugu Ap Assembly, Ap, Chandrababu, Cm Jagan, Jagan, Janasena, Janasenatdp, Jan Telugu Ap Assembly, Ap, Chandrababu, Cm Jagan, Jagan, Janasena, Janasenatdp, Jan](https://telugustop.com/wp-content/uploads/2024/02/ycp-tdp-janasena-chances-of-winning-in-Uttarandhra-detailsd.jpg)
విజయనగరం జిల్లా విషయానికి వస్తే.వైసిపికి చీపురుపల్లి, గజపతినగరం, సాలూరు, కురుపాం ,పార్వతీపురం నియోజకవర్గాలు అనుకూలంగా ఉండగా, టిడిపికి బొబ్బిలి, రాజాం, విజయనగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయట.ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇక్కడ టఫ్ ఫైట్ నడిచేలా కనిపిస్తోంది.
విజయనగరం లో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా.విశాఖ తూర్పు ,పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో టిడిపి ,ఉత్తర నియోజకవర్గం లో వైసీపీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి, భీమిలి ,గాజువాక, అనకాపల్లి, పెందుర్తి ,చోడవరం ,నర్సీపట్నం నియోజకవర్గాలు టిడిపి, జనసేన లకు ఎడ్జ్ కనిపిస్తోంది.
మాడుగుల, అరకు, పాడేరులో వైసీపీకి సానుకూలత కనిపిస్తోంది, అరకులో టఫ్ ఫైట్ ఉండబోతోందట.