తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన మంత్రుల బృందం, ఎమ్మెల్యేలు ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లనున్నారు.ఈ మేరకు అసెంబ్లీ నుంచి ప్రజాప్రతినిధులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ( Medigadda Barrage )కు బయలుదేరనున్నారు.
సీఎం బృందం బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వస్తున్న నేపథ్యంలో.పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఈ నేపథ్యంలోనే పరిసర అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాట్లు పూర్తికాగా.నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసు బలగాలు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాయి.మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజా ప్రతినిధుల బృందం మేడిగడ్డకు చేరుకోనుంది.ఈ క్రమంలో సాయంత్రం 5 గంటలకు బ్యారేజ్ ను పరిశీలించనున్నారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram )నిర్మాణం, ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి వంటి అవకాశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.







