తెలుగు ప్రేక్షకులకు నటుడు కమల్ హాసన్( Kamal haasan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరోగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కమల్ హాసన్.
ఇది ఇలా ఉంటే నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.ఆ సినిమాను నేరుగా యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయబోతున్నారు.
ఈ మేరకు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
23 ఏళ్ళ క్రితం కమల్ హాసన్ హీరోగా నటించిన హే రామ్ సినిమా( Hey ram movie )కు ఆయనే దర్శకత్వం వహించడంతో పాటు రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు.మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చారు.తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కగా.హిందీలో షారుఖ్ ఖాన్ తన డ్రీమ్జ్ అన్‌లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల చేశారు.2000 ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదలైంది.కాగా హే రామ్ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు షారుఖ్ ఖాన్, హేమ మాలిని, రాణి ముఖర్జీ లాంటి బిగ్ స్టార్స్‌తో పాటు గిరీష్ కర్నాడ్, నజీరుద్దీన్ షా, ఓం పురి, నాజర్, అతుల్ కులకర్ణి వంటి ప్రముఖ నటులు నటించారు.
పీరియడ్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో భారత్-పాకిస్థాన్ ( India-Pakistan )విభజన, మహాత్మ గాంధీ( Mahatma Gandhi )ని నాథూరాం గాడ్సే హత్య చేయడం వంటి అంశాలను చూపించారు.ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు.అంతేకాదు, 2000 సంవత్సరంలో ఈ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్స్‌కు పంపింది.
కానీ, ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ కాలేదు.కాగా ఈ మూవీ మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను దక్కించుకుంది.
ఇలాంటిమంచి చిత్రాన్ని ఇప్పుడు యూట్యూబ్ ( Youtube )ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఛానెల్‌లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి హే రామ్ స్ట్రీమింగ్ కానుంది.
యూట్యూబ్‌లో ఉచితంగా ఈ సినిమాను చూడవచ్చు.