కారు 2వ అంతస్తులోకి దూసుకెళ్లడమేమిటి అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.అమెరికాలో ఏదైనా సాధ్యమే.
అయితే ఒక అరుదైన ఫీట్ అని భావించకండి.ఇదొక దారుణమైన కారు ప్రమాదం.
ఈ ప్రమాదంలో అడురుష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు కానీ.ప్రమాదం జరిగిన విధానం చూసి స్థానికులతో పాటు నెటిజనం కూడా షాకవుతున్నారు.
కారు ఎంత వేగంతో వస్తే అంత పైకి ఎగిరి ఉంటుందో అని లెక్కలు వేస్తున్న పరిస్థితి.కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘జంక్షన్ ఫైర్ కంపెనీ’( Junction Fire Company ) ఫేస్ బుక్‌లో ఈ పోస్ట్ పెట్టడం జరిగింది.దాంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
![Telugu Lewistown, Company, Latest, Pennsylvania-Latest News - Telugu Telugu Lewistown, Company, Latest, Pennsylvania-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/A-car-suddenly-entered-the-2nd-floor-what-happenedb.jpg)
పెన్సిల్వేనియాలోని( Pennsylvania ) జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రమైన గాయాలతో బయటపడ్డాడు.అల్ఫారటా రోడ్డులోని 800 బ్లాక్ లో మధ్యాహ్నం 3 గంటల 15 నిముషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.వేగంగా వచ్చిన కారు 2వ అంతస్తును ఢీ కొట్టడంతో కారు లోనికి చొచ్చుకుని వెళ్లింది.ప్రమాదం జరిగిన 17 నిముషాల్లో రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకోవడం విశేషం.
ఇంటి యజమానికి కూడా సాయం చేశారు.అందుకు 3 గంటల సమయం పట్టింది.
క్రాష్‌కి సంబంధించి ఎంత నష్టం జరిగిందో ఇంకా తెలియాల్సి వుంది.డ్రైవర్‌ను EMS సిబ్బంది గీసింగ్ లూయిస్‌టౌన్( Geising Lewistown ) ఆసుపత్రికి తరలించారు.
![Telugu Lewistown, Company, Latest, Pennsylvania-Latest News - Telugu Telugu Lewistown, Company, Latest, Pennsylvania-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/A-car-suddenly-entered-the-2nd-floor-what-happenedc.jpg)
కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను జంక్షన్ ఫైర్ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయా ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తగ చక్కెర్లు కొడుతున్నాయి.నెటిజన్లు ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు.అయితే ప్రాణాలతో ఆ కారులో వున్నవారు బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.కానీ డ్రైవర్ కి మాత్రం ఓ రేంజులో ఏసుకుంటున్నారు.తప్పతాగి డ్రైవ్ చేసావా? అని కొంతమంది అడిగితే… నువ్వు రోడ్డు పై కాకుండా ఇళ్లపై కారుని నడుపుతావా? ఎన్ని ప్రాణాలు పోయేవో తెలుసా? అంటూ క్లాస్ పీకుతున్నారు.