Payal Rajput : పెళ్లైన వాళ్లు కూడా అలాంటి పనులు చేస్తున్నారు.. పాయల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్( RX100 Payal Rajput ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.

 Payal Rajput About Marriage And Soul Mate-TeluguStop.com

నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది.కాగా పాయల్ రాజ్ పుత్ సినిమాలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికి తెలిసిందే.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో అందాల కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Insta Story, Payal Rajput, Saurabh Dhingra, Soul Mate, Tollywood-Movie</di ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు వస్త్రధారణ విషయంలో ట్రోల్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.ఇక సమయం దొరికినప్పుడల్లా తన బాయ్ ఫ్రెండ్( Saurabh Dhingra ) తో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన ప్రతిసారి అభిమానులు పెళ్లెప్పుడు అని ప్రశ్నించగా ఆ ప్రశ్నలను దాటి వేస్తూ వస్తోంది.ఇది ఇలా ఉంటే పాయల్ తన ప్రియుడ్ని తెలుగులోకి ఎంట్రీ ఇప్పించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

పంజాబీలో ఈ ఇద్దరూ కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్( Private Albums ) కూడా చేసినట్టు తెలుస్తోంది.

Telugu Insta Story, Payal Rajput, Saurabh Dhingra, Soul Mate, Tollywood-Movie</di ఇది ఇలా ఉంటే తాజాగా పాయల్ రాజ్ పుత్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.నీకు ఇంకా నీ సోల్ మేట్‌ కనిపించలేదని బాధపడకు ఎందుకంటే పెళ్లైన వాళ్లు కూడా ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారు అంటూ ఒక కొటేషన్‌ను షేర్ చేసింది.ఇక ఆ కొటేషన్( Quotation ) షేర్ చేస్తూ కొంటెగా నవ్వుతున్న ఒక ఎమోజీని కూడా షేర్ చేసింది.

అంటే పెళ్లైనా కూడా సోల్ మేట్స్‌( Soulmate ) దొరకడం లేదని పాయల్ కూడా చెప్పకనే చెప్పినట్టుంది.అందుకే విడాకులు కూడా అవుతున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.పెళ్లైనా కూడా ఎంతో మంది విడిపోతోన్నారు ఇప్పుడు.మరి పాయల్ తన సోల్ మేట్‌ గురించి ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube