ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం భారీగా నిధులు సేకరించిన ఎన్నారై బాలిక...

సాధారణంగా పదహారేళ్ల వయసులో స్నేహితులతో ఆడుకోవడం తప్ప ప్రపంచ సమస్యలను ఎవరూ పట్టించుకోరు.కానీ కేవలం 16 ఏళ్ల వయస్సులో భారతీయ అమెరికన్ తనిష్క ధరివాల్ ( American Tanishka Dhariwal )ప్రజల బాధలను అర్థం చేసుకుంది.

 Nri Girl Collected Huge Funds For Odisha Train Accident Victims, Tanishka Dhariw-TeluguStop.com

వారికోసం చాలా గొప్ప పని చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది.ఈ సంవత్సరం ప్రారంభంలో ఒడిశాలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ ఘటనలో బాధితులైన వారందరికీ తన వంతుగా సహాయం చేయాలని తనిష్క ధరివాల్ తలచింది.అంతేకాదు, చాలా కష్టపడి PM కేర్స్ ఫండ్ కోసం 10,000 డాలర్లకు (దాదాపు రూ.8 లక్షల 30 వేలు) పైగా సేకరించగలిగింది.

Telugu Initiative, Nri, Pm, Rana, Train Odisha-Telugu NRI

తనిష్క నిధుల సేకరణ ప్రయత్నాలకు స్నేహితులు మద్దతు ఇచ్చారు.ఈ బాలిక డబ్బులను సేకరించడానికి GoFundMe పేజీని స్థాపించింది. పాఠశాలలు, జిల్లాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసి విజయవంతంగా నిధులను కూడగట్టుకుంది.

విరాళాల కార్యక్రమం న్యూయార్క్‌లో జరిగింది, అక్కడ తనిష్క సేకరించిన మొత్తాన్ని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్‌కు ( Randhir Jaiswal )అందించింది.ఆమె తల్లిదండ్రులు నితిన్, సప్నా ధరివాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

హరిదాస్ కొటేవాలా, అశోక్ సంచేటి, రవి జార్గర్, చంద్ర సుఖ్వాల్‌తో సహా రాజస్థాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (RANA) ప్రముఖ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.తనిష్క చేసిన ప్రయత్నాలను రానా అధ్యక్షుడు, జైపూర్ ఫుట్ యూఎస్ఎ వ్యవస్థాపక చైర్ అయిన ప్రేమ్ భండారీ( Prem Bhandari ) ప్రశంసించారు.

పరాయి దేశంలో నివసిస్తున్నా భారతీయులకు ఏదైనా జరిగితే వారికి అండగా నిలవడానికి ఎన్నారైలు ముందుకు రావడం హర్షించదగిన విషయమని అన్నారు.

Telugu Initiative, Nri, Pm, Rana, Train Odisha-Telugu NRI

అంతర్జాతీయ మానవతా సహాయంలో భారతదేశం ముందుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం అందించిన సేవల గురించి కూడా ప్రస్తావించారు.వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్‌తో సహా, అవసరమైన దేశాలకు వైద్య సహాయం, వ్యాక్సిన్‌లు, సామాగ్రిని ఇండియా సరఫరా చేసిందని అన్నారు.

సహాయం చేయడం భారతీయుల రక్తంలోనే ఉందన్నట్లుగా ఈ సందర్భంగా ప్రేమ్ వ్యాఖ్యలు చేశారు.తనిష్క RANA యువ సభ్యురాలు, ఒడిషా విషాదం కోసం నిధుల సేకరణ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురైనా ఆమె ఎక్కడా అధైర్య పడకుండా వీలైనంత ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నించింది.

ఒడిశా రైలు దుర్ఘటనలో కనీసం 288 మంది ప్రాణాలు కోల్పోయారు.సుమారు 1,200 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube