ఇటీవల కాలంలో చాలా ప్రేమజంటలు రోడ్లపై విలువలు మరిచి ప్రవర్తిస్తున్నాయి.రోడ్లు, మెట్రో ట్రైన్లు, పార్కులు, సినిమా హాళ్లు, బీచ్‌లలో తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.
బైక్ నడుపుతున్న అబ్బాయికి ఎదురుగా పెట్రోల్ ట్యాంక్‌పై అమ్మాయిలు కూర్చుంటున్నారు.గట్టిగా హత్తుకుని, ముద్దులు పెట్టుకుంటూ ప్రేమికులు ముందుకు సాగుతున్నారు.
ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు చూశాం.ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
విశాఖపట్నం నుంచి ఢిల్లీ ( Visakhapatnam to Delhi )వరకు పలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.ఇలా అమ్మాయి-అబ్బాయి కాంబినేషన్ మనం చూశాం కానీ ఇద్దరు అమ్మాయిలు వెరైటీగా ప్రయత్నించారు.
అచ్చం ప్రేమికుల మాదిరిగానే ఇద్దరు అమ్మాయిలు బైక్‌పై అలాంటి సీన్ రిపీట్ చేశారు.ఓ అమ్మాయి బైక్ నడుపుతుండగా మరో అమ్మాయి ఆమెకు ఎదురుగా కూర్చుంది.
వారు ముద్దులు పెట్టుకుంటూ బైక్ స్టంట్స్( Bike Stunts ) చేశారు.బైక్ నడుపుతున్న అమ్మాయి హ్యాండిల్ వదిలేసింది.
దీనికి సంబంధించిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో మే 4న అమ్మాయిలు బైక్ నడుపుతూ ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.ఇదే వీడియో మరోసారి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అమ్మాయి-అబ్బాయి ముద్దు పెట్టుకుంటే వారు ప్రేమికులు అనుకోవచ్చు.
కానీ సోషల్ మీడియాలో లైకుల పిచ్చితో ఇద్దరు అమ్మాయిలు ప్రేమికులులా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.బైక్ నడుపుతూ ఎదురెదురుగా కూర్చుని వారిద్దరూ రొమాన్స్ చేశారు.
బైక్ నడుపుతున్న అమ్మాయి మధ్యలో హ్యాండిల్ వదిలేసి, తన ఎదురుగా ఉన్న అమ్మాయిని ముద్దు పెట్టుకుంది.దీంతో ప్రమాదానికి గురైతే పరిస్థితి ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఏం అయినా చేస్తారా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.విలువలు మరిచి అంతా ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.