ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి( CM jagan ) వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఆ దిశగానే ఆయన వ్యూహ రచన కూడా సాగుతోంది.
అయితే ఆయా జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆయనను కొంత కలవర పెడుతున్నాయి.ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని తాజా పరిణామాలు వైసీపీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఆయన బాబాయ్ రూప్ కుమార్ మద్య గత కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంతలా వివాదాలు కొనసాగుతున్నాయి.
అలాగే ఆ మద్య నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి9 Kotamreddy Sridhar Reddy ) మరియు చంద్రగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే దీంతో జిల్లాలో పార్టీ క్యాడర్ క్రమేసి బలపడుతూ వచ్చింది,ప్రస్తుతం జిల్లాలోని మరికొందరు వైసీపీ నేతలు కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట.దీనికి కారణం జిల్లాలో నేతల మద్య అంతర్గత కుమ్ములాటలే అని తెలుస్తోంది.దాంతో జిల్లాలోని స్థానిక నేతలు మరియు కార్పొరేటర్లు పక్క చూపులు చూస్తున్నట్లు టాక్.
వైసీపీ కార్పొరేటర్ బొబ్బాల శ్రీనివాస్ ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లో ఉంటున్నారని టాక్.
ఆయనతో పాటు మరికొంత మంది కూడా టీడీపీ( TDP party ) వైపు చూస్తున్నారట.దీంతో జిల్లాలో వైసీపీ( YCP party ) క్యాడర్ అత్యంత బలహీనంగా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్నీ అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
కానీ ఈసారి ఎన్నికల్లో కనీసం రెండు సీట్లు కూడా దక్కించుకునే పరిస్థితి లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట.ఇక ప్రస్తుతం అనిల్ యాదవ్ మరియు రూప్ కుమార్ లా మద్య నెలకొన్న విభేదాల కారణంగా ఈసారి అనిల్ కు టికెట్ కూడా కష్టమే అని వాదన నడుస్తోంది.ఇలా మొత్తానికి నెల్లూరులో వైసీపీ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.మరి ఈసారి నెల్లూరు వసూలు వైసీపీకి ఎలాంటి ఫలితాలను కట్టబెడతారో చూడాలి.