వ్యవసాయ రంగంలో రోజురోజుకు కూలీల కొరత( Labor Shortage ) అధికం అవుతూ ఉండడంతో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అయితే కూలీల కొరతకు ప్రత్యామ్నాయంగా యాంత్రిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.
సాధారణంగా వరి పంట( Paddy ) పండించే రైతులు చేతులతో విత్తనాలు చల్లుకొని నారు వచ్చాక ప్రధాన పొలంలో నాటుకుంటారని తెలిసిందే.ఈ పద్ధతి పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా కొనసాగుతోంది.
చేతులతో విత్తనాలు చల్లడం( Seeds ) ద్వారా విత్తనాల ఖర్చు పెరగడంతో పాటు మొలకలు సమానంగా ఉండవు.మట్టి పై భాగంలో పడిన విత్తనాలు తొందరగా మొలక ఎక్కుతాయి.
మట్టిలో కాస్త లోపలికి పడ్డ విత్తనాలు ఆలస్యంగా మొలకఎత్తుతాయి.దీని ద్వారా నారు అంత సమానంగా ఉండదు.
ఈ సమస్యకు పెట్టేందుకు డ్రమ్ సీడర్( Drum Seeder ) అనే పరికరం అందుబాటులోకి వచ్చింది.

ఈ డ్రమ్ సీడర్ పరికరం ఉపయోగిస్తే కూలీల ఖర్చు తగ్గడంతో పాటు విత్తనాల ఖర్చు కూడా కాస్త ఆదా అవుతుంది.ఈ పరికరం నేలపై విత్తనాలను సమాన రీతిలో చల్లుతుంది.ఈ డ్రమ్ సీడర్ లో సీడింగ్ రేటింగ్ ఎంత కావాలంటే అంత మార్చుకోవచ్చు.
అది ఎలా అంటే ఈ పరికరంలో నాలుగు వరుసల డ్రమ్ సీడర్, 8 వరుసల డ్రమ్ సీడర్ రెండు రకాలు ఉంటాయి.

ఈ పరికరం ద్వారా వడ్ల గింజలు నారుగా పోసుకోవాలంటే ముందుగా వడ్లను 12 గంటల ముందు నానబెట్టాలి.ఈ పరికరంతో విత్తనాలు చల్లితే విత్తనాల మధ్య పది మిల్లీమీటర్ల దూరం, వరుసల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చల్లుతుంది.ఈ పరికరంతో ఒకరోజులో నాలుగు ఎకరాల భూమిలో విత్తనాలను నారుగా చల్లుకోవచ్చు.
ఒక ఎకరం పొలానికి దాదాపుగా 10 కేజీల విత్తనాలు అవసరం.ఈ పరికరంలో విత్తనాలు వేసి హేండిల్ పట్టుకొని పొలంలో లాక్కుంటూ తిరగాలి.ఈ పరికరానికి ఉండే చక్రాలు తిరగడం వల్ల విత్తనాలు సమానంగా పడతాయి.దీంతో కూలీల ఖర్చు దాదాపుగా ఆదా అయినట్టే.