విజయవాడలో జనసేన నేతలపై వీఆర్వో పోలీస్ ఫిర్యాదు..!!

వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే.మహిళా అక్రమ రవాణాలకు వాలంటీర్లు పాల్పడుతున్నారని ఆరోపించడం జరిగింది.

 Vro Police Complaint Against Janasena Leaders In Vijayawada , Janasena, Pawan Ka-TeluguStop.com

దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఈ క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కి నోటీసులు కూడా పంపించడం జరిగింది.

అయితే ఇదే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో జనసేన నేతలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి.తాజాగా విజయవాడలో పనిచేస్తున్న వీఆర్వో బాలమ్మ( VRO Balamma ) ఏకంగా 34 మంది జనసేన నాయకులపై పోలీస్ ఫిర్యాదు చేయడం జరిగింది.

రోడ్డుపై ధర్నా చేసి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీంతో బాలమ్మ ఫిర్యాదును పోలీసులు పరిశీలిస్తున్నారు.జనసేన( Janasena ) నాయకులపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ పరిణామంతో వైసీపీ( YCP ) ప్రభుత్వంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతారా.? ఎన్ని కేసులు పెట్టిన వెనకడుగు వేయమని జనసేన నేతలు అంటున్నారు.వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోత్తిన వెంకట మహేష్.

ఆధ్వర్యంలో చిట్టి నగర్ సెంటర్ లో ఆందోళనలు చేస్తూ ఉండటంతో వారిపై వీఆర్వో బాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube