టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించినటువంటి నటుడు ఆశిష్ విద్యార్థి ( Ashish Vidyarthi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ముఖ్యంగా ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో తన నటనతో అందరిని మెప్పించారు.
ఇలా విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన గత కొద్ది రోజుల క్రితం రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా 57 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆశిష్ 33 సంవత్సరాల వయసు కలిగినటువంటి అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలీ బరువా( Rupali Barua )ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
అయితే ఇదివరకే ఈయనకు వివాహం జరిగి ఓ కుమారుడు కూడా ఉన్నారు.అయితే తన మొదటి భార్యతో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఈయన రెండవ పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్లి ఫోటోలు( Ashish Vidyarthi Second Marriage ) సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు.అయితే తాను పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను కూడా ఆశిష్ వెల్లడించారు.
పెళ్లి కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదని జీవితంలో ఒకరు తోడు ఉండాలన్న ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటారంటూ ఈయన విమర్శలకు గట్టి సమాధానం చెప్పారు.
రెండవ వివాహం చేసుకున్నటువంటి ఆశిష్ తాజాగా తన భార్యతో కలిసి హనీమూన్( Ashish Vidyarthi Honeymoon ) వెళ్లినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ దంపతులు ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను రూపాలి తన సోషల్ మీడియా( Social Media )లో పోస్ట్ చేసింది.
చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన ప్రాంతంలో దిగినటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.దీంతో పలువురు ఈ ఫోటోలపై స్పందిస్తూ భారీగా విమర్శలు కురిపిస్తూ ఈ జంటను ట్రోల్ చేస్తున్నారు.