ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్న యువతి.. ఈమె లక్ష్యం తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఈ మధ్య కాలంలో పెళ్లి పేరుతో మోసపోతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.పెళ్లి కాని వాళ్లను టార్గెట్ చేసి కొంతమంది యువతులు, యువకులు ఈ తరహా మోసాలకు తెరలేపుతున్నారు.

 Rasheeda Cheated 8 Members In Ap Telangana States Details Here Goes Viral , , R-TeluguStop.com

తాజాగా ఒక యువతి ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన తెరపైకి వచ్చింది.ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలలో ఈ యువతి పెళ్లి పేరుతో పలువురు యువకులను మోసం చేసింది.

పెళ్లైన కొన్నిరోజులకే ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకుని పారిపోవడమే లక్ష్యంగా ఈ యువతి పెళ్లిళ్లు చేసుకునేది.ఈ యువతి రషీద( Rasheeda ) అనే పేరుతో పరిచయం చేసుకుని సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తితో వివాహానికి ఓకే చెప్పింది.

ఈ ఏడాది మార్చి నెల 30వ తేదీన వీళ్లిద్దరి వివాహం జరగగా పెళ్లి జరిగిన కొన్ని రోజులకే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడం గమనార్హం.

జులై నెల 4వ తేదీన రషీద లక్షన్నర రూపాయల నగదుతో పాటు 5 సవర్ల బంగారు నగలతో అదృశ్యమయ్యారు.మూర్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు( POLICE ) దర్యాప్తు చేయగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడి( Social media )యాలో ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసి ఆ అకౌంట్ల ఆధారంగా ఈ యువతి డబ్బున్న వాళ్లను గుర్తించి వాళ్లతో పరిచయం పెంచుకునేది.

అవతలి వ్యక్తుల నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చేలా చేసి ఆ ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ వ్యక్తులను పెళ్లి చేసుకుని ఈ యువతి తర్వాత నగలు, డబ్బు తీసుకుని పారిపోయేది.కేరళ, కర్ణాటక, ఏపీలో ఇప్పటివరకు ఈ యువతి ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.పరారీలో ఉన్న రషీద పోలీసుల చేతికి చిక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.డబ్బు, నగలు తీసుకుని పరారీ కావడమే ఈ యువతి లక్ష్యమని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube