అమెరికాలో( America ) విషాదం చోటు చేసుకుంది.బీచ్‌లో మునిగిపోతున్న తన పిల్లలను రక్షించే క్రమంలో ఓ తెలుగు ఎన్ఆర్ఐ( Telugu NRI ) ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా అద్దంకి మండలానికి చెందిన 42 ఏళ్ల పొట్టి వెంకట రాజేష్ కుమార్‌గా( Potti Venkata Rajesh Kumar ) గుర్తించారు.భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు రాజేశ్ మరణించినట్లుగా అతని తమ్ముడు పి విజయ్ కుమార్ పీటీఐకి తెలిపారు.మృతుడు అమెరికాలోని ఓ స్టార్టప్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
రాజేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహాయం చేయాలని , బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు.అందులో మృతుడి పాస్‌పోర్ట్ నెంబర్, ఇతర వివరాలను ఆయన పంచుకున్నారు.
మృతుడి సోదరుడు విజయ్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్లోరిడాలోని బ్రిడ్జ్ 7 వాటర్ కమ్యూనిటీలో నివసిస్తున్నారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జూలై 4వ తేదీన సెలవుకావడంతో రాజేశ్ కుటుంబం విహారయాత్ర కోసం ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లే బీచ్‌కి( Jacksonville Beach ) వెళ్లారు.
ఈ క్రమంలో పిల్లలు సముద్రంలో మరింత ముందుకు వెళ్లడాన్ని గమనించిన రాజేశ్ వారి వెనుకే పరిగెత్తి తన కొడుకును రక్షించేందుకు యత్నించాడు.
ఈలోగా మరో పెద్ద అల రాజేష్‌ను లోపలికి లాక్కెళ్లిందని విజయ్ కుమార్( Vijay Kumar ) మీడియాకు తెలిపారు.సహాయక బృందాలు, తోటి పర్యాటకులు అతనిని రక్షించి ఒడ్డుకు చేర్చే సమయానికి రాజేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.దీంతో అతనిని హెలికాఫ్టర్‌లో ఆసుపత్రికి తరలించారు.
ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో తండ్రితో పాటు కొడుకు కూడా స్పృహతప్పి పడిపోయాడని విజయ్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆసుపత్రిలో రాజేష్ కుమారుడు షాక్ ట్రీట్‌మెంట్‌కు స్పందించగా అతనికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.కానీ రాజేష్ మాత్రం తుదిశ్వాస విడిచాడు.అతని మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
స్వగ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.రాజేశ్ మృతదేహాన్ని అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)( TANA ) భారతదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తోంది.
అలాగే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్‌టీఎస్)ని కూడా కుటుంబ సభ్యులు సంప్రదించారు.
.