రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతులకు భువనగిరి పోలీసులు సంకెళ్లు వేశారు.14 రోజుల రిమాండ్ ముగిసిన నేపథ్యంలో రైతులను భువనగిరి కోర్టులో హజరుపరిచారు.
ఈ క్రమంలో రైతులను న్యాయస్థానానికి తీసుకువచ్చే సమయంలో సంకెళ్లు వేశారు.అయితే రైతులకు సంకెళ్లు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో భువనగిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు.