తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రభాస్ శ్రీను( Prabhas Srinu ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా విలన్ గా సహాయ నటుడిగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
దాదాపు 300 సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.మరి ముఖ్యంగా ప్రభాస్ శ్రీను కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పవచ్చు.
తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.ఇక ప్రభాస్ శీను కి ప్రభాస్ మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే.
ఇండస్ట్రీలో తనకు అన్ని ప్రభాసే అని ఏ విషయాన్ని అయినా ముందుగా తనతోనే పంచుకుంటాను అని తెలిపారు ప్రభాస్ శ్రీను.ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను అనేక సందర్భాలలో ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని ప్రభాస్ కి తనకు మధ్య ఉన్న బాండింగ్ ని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందె.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను సీనియర్ నటి తులసి( Actress Tulsi ), తనకు మధ్య ఏదో ఉంది అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు.ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.
తులసిగారితో నేను ఎక్కువ సినిమాలు చేయలేదు.కానీ మా మీద చాలా రూమర్స్ వచ్చాయి.
ఆవిడ నాకు తల్లితో సమానం.డార్లింగ్ సినిమా( Darling movie ) సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాము.ఆవిడ పెద్ద నటి.ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు.ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని, కానీ చాలామంది దానినతప్పుగా అపార్థం చేసుకున్నారు.మాపై రూమర్స్ వచ్చినప్పుడు మొదట ఆవిడే నాకు మెసేజ్ పెట్టారు.ఇలా రాశారు మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా అపార్థం చేసుకుంటుందేమోనని నా భార్య డాక్టర్.ఆ రూమర్స్ చూసి ఇద్దరం నవ్వుకొని వదిలేశాము.
తులసి గారంటే నాకు చాలా గౌరవం.ఆవిడ ఎప్పుడూ పూజలకు సంబంధించిన మెసేజ్ లే పెడుతుంటారు అని చెప్పుకొచ్చారు ప్రభాస్ శ్రీను.