చంద్రుడిని సూర్యుడిగా మార్చిన యంగ్ టైగర్.. చికెన్ కోసం అలా చేయడంతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) ప్రతిభ ఉన్న టాలెంటెడ్ హీరోలలో ముందువరసలో ఉంటారు.ఈ మధ్య కాలంలో తారక్ ప్రముఖ కంపెనీల యాడ్స్ లో నటిస్తుండగా ఆ యాడ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

 Junior Ntr Mc Donald  Ad Video Goes Viral In Social Media , Junior Ntr  , Mc Don-TeluguStop.com

కొన్నిరోజుల క్రితం తారక్ మెక్ డొనాల్డ్స్ యాడ్( McDonald ) లో నటిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి రాగా తాజాగా ఆ యాడ్ విడుదలైంది.

Telugu Devara, Ntr, Koratala Siva, Mc Donald Ad, Tollywood-Movie

తారక్ తన ఫ్రెండ్స్ తో కలిసి చికెన్ తినడానికి వెళ్లగా మేనేజర్ సార్ ఇది క్లోజింగ్ టైమ్ అని చెబుతాడు.తారక్ వెంటనే అగ్గిపెట్టె తీసుకుని అగ్గిపుల్లను వెలిగించగా చంద్రుడు సూర్యుడిలా మారిపోవడం గమనార్హం.తారక్ మేనేజర్ తో సార్ ఇది ఓపెనింగ్ టైమ్ అని చెప్పగా ఎలా సాధ్యమైందని మేనేజర్ అడుగుతాడు.

తారక్ వెంటనే “మెక్ డొనాల్డ్స్ మెక్ స్పైసీ చికెన్ షేర్స్.స్పైసీని మీరు వివరించలేరు.షేర్ చేసుకోవాలి” అనే పంచ్ డైలాగ్ తో యాడ్ ను ముగించారు.

Telugu Devara, Ntr, Koratala Siva, Mc Donald Ad, Tollywood-Movie

ఈ యాడ్ లో తారక్ లుక్ కొత్తగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తారక్ కొత్త యాడ్ తో మెక్ డొనాల్డ్స్ కు కచ్చితంగా ప్లస్ అవుతుంది.మెక్ డొనాల్డ్స్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తారక్ ప్రస్తుతం దేవర ( Devara )సినిమాతో బిజీగా ఉన్నారు.రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది.ఈ సెంటిమెంట్ ను తారక్ కచ్చితంగా బ్రేక్ చేసి దేవర సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కు రాబోయే రోజుల్లో కెరీర్ బెస్ట్ హిట్లు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉండనుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube