ఈ ఐపీఎల్ సీజన్ -16( IPL Season 16 ) లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగి సక్సెస్ ఫుల్ గా 70 మ్యాచ్ ల లీగ్ దశ ముగిసింది.ప్రస్తుతం ప్లే ఆఫ్( Playoffs ) మ్యాచులు జరుగుతున్నాయి.
ఇక గుజరాత్, చెన్నై, లక్నో, ముంబై( GT, CSK, LSG, MI ) జట్లు ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే.తాజాగా జరిగిన క్వాలిఫయర్ వన్ మ్యాచ్లో 15 పరుగుల తేడాతో చెన్నై జట్టు ఘనవిజయం సాధించి ఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే.
ఇక నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో గుజరాత్ జట్టు శుక్రవారం క్వాలిఫయర్ -2 మ్యాచ్ ఆడనుంది.ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు కు చెన్నై జట్టుకు అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అయితే లీగ్ మ్యాచ్లు వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దు అయితే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారని అందరికీ తెలిసిందే.కానీ ప్లే ఆఫ్ మ్యాచ్ లు రద్దయితే ఏంటి పరిస్థితి.? అప్పుడు నిబంధనలు ఎలా ఉంటాయి.ఎలా టైటిల్ విన్నర్ ను నిర్ణయిస్తారో చూద్దాం.
సాధారణంగా బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐపీఎల్ లో జరిగే క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయితే.టైటిల్ విన్నర్ ను సూపర్ ఓవర్ నిర్వహించి ఫలితాన్ని నిర్ణయిస్తారు.సూపర్ ఓవర్ అంటే చాలామందికి తెలుసు.మ్యాచ్ డ్రా అయినప్పుడు సూపర్ ఓవర్ నిర్వహించి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తారు.అంటే కేవలం ప్లే ఆఫ్ కు చేరిన జట్లకు ఒక్క ఓవర్ మ్యాచ్ నిర్వహించి టైటిల్ విన్నర్ ను ఎంపిక చేస్తారు.వాతావరణ పరిస్థితులు సూపర్ ఓవర్ నిర్వహించడానికి అనుకూలించకపోతే.
లీగ్ పాయింట్ల పట్టికలో ఉండే జట్ల స్థానాన్ని బట్టి ఫలితాన్ని నిర్ణయిస్తారు.
అది ఎలా అంటే నేడు ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై – లక్నో మధ్య జరగనుంది.
ఈ మ్యాచ్ రద్దు అయితే ఏ జట్టు పాయింట్లు అధికంగా ఉంటే ఆ జట్టుకు ఫలితం అనుకూలంగా ఉంటుంది.పాయింట్లు సమానంగా ఉంటే, నెట్ రన్ రేట్ పరంగా నిర్ణయిస్తారు.
ఒకవేళ ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే ఇరుజట్లు సమానంగా టైటిల్ పంచుకుంటాయి.