జబర్దస్త్( Jabardast ) షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన కమెడియన్లలో పటాస్ ప్రవీణ్ ఒకరు.ఇతర కమెడియన్లతో పోల్చి చూస్తే భిన్నంగా ఉండే కామెడీ టైమింగ్ పటాస్ ప్రవీణ్ సక్సెస్ కు కారణమైంది.
పటాస్ ప్రవీణ్, ఫైమా ( Faima )ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే.వీళ్లిద్దరి ప్రేమకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.
పటాస్ ప్రవీణ్, ఫైమా పలు షోలలో ప్రేమకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించడం జరిగింది.ఫైమా బిగ్ బాస్ షోకు వెళ్లిన తర్వాత ప్రవీణ్, ఫైమా మధ్య దూరం పెరిగింది.
బిగ్ బాస్ అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం ఫైమా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతర ఛానెళ్లలో పాల్గొనడానికి అవకాశం లేదు.అయితే పటాస్ ప్రవీణ్ పెళ్లి చేసుకున్నారంటూ ఒక ఫోటో సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఒకింత షాక్ కు గురవుతుండటం గమనార్హం.
పటాస్ ప్రవీణ్( Patas praveen ) తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రేక్షకులకు పరిచయం లేని అమ్మయితో తన పెళ్లి జరిగినట్టు వీడియోను పంచుకున్నారు.ఈ పెళ్లి వేడుకకు జబర్దస్త్ కొమరంతో పాటు మరి కొందరు హాజరయ్యారు.అయితే వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు ఏదో టీవీ షో కోసం ప్రవీణ్ ఇలా చేస్తున్నాడని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
అయితే ప్రవీణ్ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా వీడియోలో ఉంది.
పటాస్ ప్రవీణ్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.వైరల్ అవుతున్న వీడియో గురించి నెటిజన్లలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.ప్రవీణ్ షేర్ చేసిన వీడియోకు 1,37,000కు పైగా లైక్స్ వచ్చాయి.
ఈ పెళ్లి నిజం పెళ్లి అయినా, ఫేక్ పెళ్లి అయినా భవిష్యత్తులో ప్రవీణ్ పై మాత్రం ట్రోల్స్ తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.