అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా తో దర్శకుడిగా ఒక్కసారిగా స్టార్ అయిన సందీప్ వంగ( Sandeep Vanga ) ప్రస్తుతం హిందీలో యానిమల్( Animal ) అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
ఆ తర్వాత సందీప్ వంగ చేయబోతున్న సినిమా ఏంటి అంటే స్పష్టత లేదు.
అయితే ప్రభాస్ తో స్పిరిట్ మరియు అల్లు అర్జున్ తో ఒక సినిమా ను సందీప్ వంగ అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వాలంటే మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.కనుక అప్పటి వరకు సందీప్ వంగ వెయిట్ చేస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు.
ఇప్పటి వరకు అర్జున్ రెడ్డి సినిమా ఇమేజ్ తోనే కెరీర్ ను నెట్టుకు వచ్చిన సందీప్ ఈసారి యానిమల్ సినిమా తో తన సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.కనుక చిరంజీవి( Chiranjeevi ) పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రభాస్( Prabhas ) తో చేయబోతున్న స్పిరిట్ మూవీ( Spirit movie ) కంటే ముందు చిరంజీవి తో ఒక సినిమాను సందీప్ చేసేందుకు రెడీ అవుతున్నాడని.నాలుగు లేదా అయిదు నెలల్లోనే ఆ సినిమాను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.కానీ ఆ ప్రచారం లో నిజం లేదని తేలిపోయింది.ప్రస్తుతం భోళా శంకర్ సినిమా ని చేస్తున్న చిరంజీవి ఆ వెంటనే కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మూవీ ని చేసేందుకు గాను ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే కళ్యాణ్ కృష్ణ సినిమా కు పూజా కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.గతంలో సందీప్ చెప్పిన కథ విన్న చిరంజీవి ఇంప్రెస్ అయ్యి చేద్దాం అంటూ హామీ ఇచ్చాడట… కానీ ఇప్పుడు ఆ సినిమా లేదు అంటున్నారు.
కనుక ప్రభాస్ తోనే సందీప్ తదుపరి సినిమా ఉంటుంది.ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది అనేది కన్ఫర్మ్.