మునగకాయలు, మునగాకు( munagaku, Drumsticks ) వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి దాదాపు చాలామందికి తెలుసు.కానీ చాలామంది మునగాకు లేదా మునగకాయలను తినడానికి ఎక్కువగా ఇష్టపడరు.
కొంతమంది మునగకాయలు తింటే మునగాకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు.కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మునగకాయలతో పాటు మునగాకులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు( Medicinal properties ) ఉన్నాయి.
మనకు మార్కెట్లో అప్పుడప్పుడు మునగ ఆకులు కూడా అమ్ముతూ ఉంటారు.విదేశాలలో కూడా మునగాకును ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు.మునగ ఆకుతో పోలిస్తే కాయల్లో విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉంటాయి.మునగాకులో విటమిన్ సి( Vitamin C ) ఎక్కువగా ఉంటుంది.ప్రతిరోజు మునగాకుని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.మునగాకులో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ A పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందవచ్చు.
కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును ఎక్కువగా ఉపయోగిస్తారు.పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants ) ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా గుండె జబ్బులు, టైప్ టు డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇది పోరాడుతుంది.ఇందులో విటమిన్ సి,బీటా కెరోటిన్లు అధిక మొత్తంలో ఉంటాయి.
మూడు నెలలపాటు ప్రతిరోజు ఒక టీ స్పూన్ మునగాకు పొడిని తీసుకోవడం వల్ల రక్తంలోని యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి గణనీయంగా పెరుగుతుంది.అంతేకాకుండా బ్లడ్ షుగర్ స్థాయిలను కూడా తగ్గించవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మునగాకు రక్తంలో చక్కెర స్థాయినీ తగ్గించడంలో సహాయపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.