ఈ ప్రపంచంలో చాలా దేశాలు ఉద్యోగం, టూరిజం తదితర అంశాలను ఆధారంగా చేసుకొని ఎన్నో రకాల వీసాలను( Visas ) ఆఫర్ చేస్తుంటాయి.అందులో ఒకటి జాబ్ సీకర్ వీసా( Job Seeker Visa ).
ఆఫర్ లెటర్ లేదంటే స్పాన్సర్ లేకుండా ఉపాధి కోసం వెతకడానికి ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి వీలుపడదు.ఎందుకనే వీసా నియమ నిబంధనలు ఒప్పుకోవు.
ఇక ఉపాధి పొందిన తరువాత, అక్కడి రిక్వైర్మెంట్స్ ఫుల్‌పిల్ చేస్తే శాశ్వత నివాసాన్ని కూడా పొందే అవకాశం లేకపోలేదు.
అయితే జాబ్ ఆఫర్ లెటర్ లేకుండానే ఇన్ని ప్రయోజనాలు ఉన్న జాబ్ సీకర్ వీసా అందించే దేశాలు ఈ ప్రపంచంలో కొన్ని వున్నాయి.అందులో మొదటిది ఆస్ట్రియా( Austria ).అవును, సెంట్రల్ యూరప్‌కు చెందిన ఆస్ట్రియా జాబ్ సీకర్ వీసాను కేవలం 6 నెలల వ్యవధితో జారీ చేస్తుంది.ఈ వీసా జారీలో అక్కడి ప్రభుత్వం 100 పాయింట్స్‌తో ఓ ప్రమాణాల జాబితాను రూపొందించగా అందులో కనీసం 70 స్కోర్ చేసిన వ్యక్తులు మాత్రమే జాబ్ సీకర్ వీసా పొందడానికి అర్హులు.ఆ తరువాత లిస్టులో జర్మనీ( Germany ) వుంది.
ఈ దేశం కూడా 6 నెలల వ్యవధితో జాబ్ సీకర్ వీసాను జారీ చేస్తోంది.అయితే దీనికి సాధారణ నియమాలు ఉంటే సరిపోతుంది.
తరువాత పోర్చుగల్( Portugal ) గురించి మాట్లాడుకోవాలి.ఈ యూరప్ దేశం 120 రోజుల కాలవ్యవధితో ఈ రకం వీసాలను జారీ చేస్తోంది.అయితే పోర్చుగల్ అందించే జాబ్ సీకర్ వీసా అర్హత ప్రమాణాల గురించి స్పష్టత లేదు.అదేవిధంగా స్వీడన్ కంట్రీ కూడా 3 నుంచి 9 నెలల కాల వ్యవధితో జాబ్ సీకర్ వీసాను జారీ చేస్తుంది.
తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( United Arab Emirates ) గురించి మాట్లాడుకోవాలి.ఈ అరబ్ దేశం 60 రోజులు, 90 రోజులు లేదా 120 రోజుల కాల వ్యవధితో జాబ్ సీకర్ వీసాను ఆఫర్ చేస్తోంది.ఎమిరైటేషన్ ప్రకారం.వీసా పొందాలనుకునే వారు మొదటి మూడు స్కిల్ లెవల్స్‌లో మేనేజర్స్ లేదా శాస్త్రీయ రంగాలలో ప్రొఫెషనల్‌గా ఉండాలి