పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నాడు.ఆ సినిమాల్లో సాహో సుజిత్( Saaho Sujith ) దర్శకత్వంలో రూపొందుతున్న ఓ జి సినిమా ఒకటి అనే విషయం తెలిసిందే.
ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే.నాని తో గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శర్వానంద్ తో కలిసి శ్రీకారం సినిమాలో నటించింది.
రెండు సినిమాలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.అంతే కాకుండా రెండు సినిమాల్లో హీరోయిన్ పాత్రకి మంచి గుర్తింపు లభించింది అనడంలో సందేహం లేదు.
అయినా కూడా శ్రీకారం సినిమా తర్వాత ప్రియాంక మోహన్( Priyanka Mohan ) తెలుగులో సినిమాలు చేయలేదు.ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సినిమాలో ఈమె సినిమా చేస్తోంది.
పవన్ కళ్యాణ్ తో ఆఫర్ వచ్చిన వెంటనే ప్రియాంక కి టాలీవుడ్ నుండి భారీ ఎత్తున ఆఫర్స్ వస్తున్నాయట.పవన్ కళ్యాణ్ తో షూటింగ్ లో ఉన్న ప్రియాంక ఎప్పటికప్పుడు తన వద్దకు వస్తున్న నిర్మాతలకు నో చెబుతుందని తెలుస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలైన తర్వాత కొత్త సినిమాను కమిట్ అవ్వాలని నిర్ణయించుకుందట.పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత కచ్చితంగా తన స్టార్ డం మరియు రెమ్యూనరేషన్ డబల్ అయ్యే అవకాశం ఉంది.కనుక పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే వరకు వెయిట్ చేస్తే బాగుంటుందని ఆమె సన్నిహితులు కూడా సూచిస్తున్నారని తెలుస్తోంది.అన్ని అనుకున్నట్లు జరిగితే పవన్ కళ్యాణ్ తో సినిమా వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
కనుక అప్పటి వరకు ప్రియాంక మోహన్ తన కొత్త సినిమా ఎంపిక విషయంలో వెయిట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ తో వచ్చిన ఆఫర్ ని సద్వినియోగం చేసుకొని వరుసగా మూడు నాలుగు సినిమాలు చేస్తే బాగుంటుంది అని కొందరు అభిప్రాయం చేస్తున్నారు.
కానీ ప్రియాంక మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన తర్వాతే కొత్త సినిమాలకు కమిట్ అవుతానంటూ చాలా తెలివిగా తప్పించుకుంటుంది.పవన్ కళ్యాణ్ తో సినిమా వల్ల ఈ అమ్మడు ఎంత లాభం దక్కించుకుంటుంది అనేది చూడాలి.