ఈ ఏడాది వరకే బుట్టబొమ్మ హడావుడి.. అక్కడ బొక్క బోర్లా

తెలుగులో ఒక లైలా కోసం, ముకుందా చిత్రాలతో హీరోయిన్ గా పరిచయమైన పూజా హెగ్డే( Pooja Hegde ) ఆ సినిమాలతో పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేదు.ఆ సినిమాలు విడుదలైన తర్వాత సరిగ్గా రెండు సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకుంది.

 Pooja Hegde Next Year Planning ,pooja Hegde,salman Khan,kisi Ka Bhai Kisi Ki Jaa-TeluguStop.com

ఆ సమయం లో హిందీ లో ఒక భారీ సినిమాని చేసింది.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

దాంతో మళ్లీ తిరిగి సినిమా ఇండస్ట్రీలోనే అల్లు అర్జున్( Allu Arjun ) కు జోడిగా డీజే చిత్రం లో నటించింది.మొదటి రెండు సినిమాలతో పోలిస్తే డీజే చిత్రం( DJ )లో ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు.

అల్లు అర్జున్ ని మించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం లో సక్సెస్ అయింది.దర్శకుడు హరీష్ శంకర్ ఈమెను అద్భుతంగా చూపించాడు.


Telugu Bollywood, Mahesh Babu, Pooja Hegde, Salman Khan, Telugu-Movie

ఆమె పాత్ర కు చాలా ప్రాముఖ్యత ను కలిగించాడు.దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారి పోయింది.పూజా హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోయిన్( Tollywood Star Heroine ) గా నెంబర్ వన్ హీరోయిన్ గా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది.అయితే ఈ మధ్య కాలంలో ఆమెకు కాస్త అవకాశాలు తగ్గాయి అని చెప్పాలి.

ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) వంటి స్టార్ హీరోతో సినిమా ను చేస్తున్న కూడా ముందు ముందు ఇతర స్టార్ హీరోల నుండి అవకాశాలు వస్తాయా అంటే అనుమానమే అనే సమాధానం వినిపిస్తుంది.ఎందుకంటే ఇప్పటికి స్టార్ హీరోల్లో చాలా మంది తో నటించేశారు.

మిగిలిన వారు ఆసక్తి చూపడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.ఇక తెలుగులో పరిస్థితి సరిగా లేదు అనే ఉద్దేశంతో హిందీలో సినిమాలను ప్రయత్నిస్తోంది.

Telugu Bollywood, Mahesh Babu, Pooja Hegde, Salman Khan, Telugu-Movie

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్( Salman Khan ) కి జోడిగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా( Kisi Ka Bhai Kisi Ki Jaan )లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా అట్టర్ ప్లాప్ అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.దాంతో పూజ హెగ్డే ని ఐరన్ లెగ్ అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

పరిస్థితి చూస్తుంటే హిందీలో మళ్లీ కొత్త అవకాశాలు వచ్చేలా లేవు.ఈ సమయంలో తెలుగులో కూడా కొత్తగా అవకాశాలు రావడం లేదు.

దాంతో పూజ హెగ్డే పరిస్థితి వచ్చే సంవత్సరంలో దారుణంగా ఉండే అవకాశం ఉందని, ఈ సంవత్సరం వరకే పూజ సందడి కొనసాగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ పూజ హెగ్డే మాత్రం మహేష్ బాబు సినిమా సక్సెస్ అయితే వరుసగా మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశ పడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube