స్టీల్ ప్లాంట్ రాజకీయం ! బీజేపీ తో సహా అన్ని పార్టీలు నవ్వులపాలు ? 

విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) వ్యవహారంలో ట్విస్ట్ ల  మీద ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి.గతంలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరిస్తున్నామని కేంద్రం ప్రకటించడంపై పెద్ద దుమారమే రేగింది.

 Steel Plant Politics! All Parties Including Bjp Are Laughing Stock, Ap Cm, Ap Cm-TeluguStop.com

దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు దీనిపై ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

ఎవరు ఎన్ని చేసినా,  కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అప్పట్లో ప్రకటించింది.అయితే ఇటీవల స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర  సహాయ మంత్రి ప్రకటించడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందని, ఇదంతా తమ వల్లే జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.ఈ విషయంలో బిజెపి , బీఆర్ఎస్,  జనసేన,  వైసిపి, టిడిపి( BJP, BRS, Jana Sena, YCP, TDP ) ఇలా అన్ని పార్టీలు ఇదంతా తమ విజయమే అని గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.

Telugu Ap Cm, Ap Cm Jagan, Brs, Chandrababu, Gvl Simharao, Janasena, Janasenani,

ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) క్రెడిట్ మొత్తం తమదే అని ప్రచారం చేసుకుంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోకపోతే బిడ్ వేస్తామని హడావుడి చేయడంతోనే,  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను కేంద్రం నిలిపివేసిందని,  కేసీఆర్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో బిజెపి కేంద్ర ప్రజలకు తెలుసునని, బీఆర్ఎస్ మంత్రులు హడావుడి చేశారు.విశాఖలో విజయోత్సవాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక అధికార పార్టీ వైసీపీ కూడా ఇదంతా క్రెడిట్ వల్ల జరిగిందని , ఇటీవల ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో ఇదే విషయంపై మాట్లాడారని , అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం చేసుకుంది.

జనసేన సైతం ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైందని, ప్రచారం చేసుకుంది.పవన్ సైతం దీనిపై ట్వీట్ కూడా చేశారు.ఇక టిడిపి నేత పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేశారని,  అందుకే ప్రైవేటీకరణ నిలిచిపోయిందని టిడిపి ప్రచారం చేసుకోగా  బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ) ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నిలిచిపోయిన క్రెడిట్ బిజెపికి దక్కేల ప్రయత్నించారు.

Telugu Ap Cm, Ap Cm Jagan, Brs, Chandrababu, Gvl Simharao, Janasena, Janasenani,

అన్ని పార్టీలు స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటూ ఉండగానే , కేంద్రం నుంచి ప్రకటన వెలువడింది .స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించడం తో ఇప్పటి వరకు గొప్పలు చెప్పుకున్న అన్ని పార్టీలు కేంద్రం ప్రకటనతో నవ్వులపాలు అయ్యాయి.ఈ విషయంలో బిజెపికి కూడా మినహాయింపు లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube