ప్రీ-అప్రూవ్డ్ లోన్స్( Pre Approved Loans ) గురించి మీరు వినే వుంటారు.సాధారణ లోన్స్ వంటివే ఇవి కూడా ఉంటాయి.
అయితే ఇక్కడ రుణదాతను సంప్రదించవలసిన అవసరం లేదు.ఎందుకంటే ఇక్కడ రుణదాతే ముందుగా మీకు మంజూరు చేయబడిన లోన్ ను మీకు అందిస్తారు.
అయితే, ఏదైనా ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ చేయడానికి ముందు కస్టమర్స్ యొక్క క్రెడిట్ సామర్థ్యాన్ని( Credit Score ) ఇక్కడ రుణదాత పూర్తిగా తనిఖీ చేస్తారని మర్చిపోవద్దు.మీఋ ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, బజాజ్ ఫైనాన్స్( Bajaj Finance ) అందిస్తున్న ఇన్‌స్టా పర్సనల్ లోన్ మీకు సహకరించడానికి సిద్ధంగా వుంది.
ఇప్పటికే ఉన్న కస్టమర్స్ మాత్రమే ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్స్ అనేవి పొందుతారు.అదే కొత్త కస్టమర్స్ అయితే తమ కోసం ప్రీ-అసైన్డ్ పరిమితులను తయారు చేయవచ్చు.రెగ్యులర్ పర్సనల్ లోన్ అయితే వయస్సు పరిమితి, సిబిల్ స్కోర్, ఉద్యోగం రకం మరియు నెలవారీ జీతం వంటి పలు అర్హతలను తప్పనిసరిగా చూస్తారు.కానీ ప్రీ-అప్రూవ్డ్ లోన్స్, ఇప్పటికే ఆమోదించబడినవి కాబట్టి మీరు ఎలాంటి అర్హత ప్రమాణాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు.
మీకు తక్షణ లోన్ ను అందించడానికి క్రెడిట్ స్కోర్, చెల్లింపు చరిత్ర మొదలైనటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు.
రుణదాత నుండి ఇప్పటికే రుణం తీసుకున్నా లేదంటే ఇప్పటికే ఏదో ఒక రకమైన సంబంధం కలిగిఉంటే మీరు కేవలం ఒక దరఖాస్తు ప్రక్రియతో ప్రీ-అప్రూవ్డ్ డీల్స్ ను పూర్తి చేయొచ్చు.రుణదాత దగ్గర ఇప్పటికే మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాలలో మీరు అదనపు డాక్యుమెంట్స్ సమర్పించవలసిన అవసరం ఇక్కడ ఉండదు.ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా యూజర్స్ ఇక్కడ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ కోసం దరఖాస్తు చేయవచ్చు.
కాబట్టి లోన్ కావాలనుకునే కస్టమర్స్ రుణదాత వెబ్‌సైట్ పై తక్షణమే లోన్ ఆఫర్స్ తనిఖీ చేయవచ్చు.