సమంత కళ్లద్దాలు పెట్టుకోవడం వెనుక రీజన్ ఇదే.. వెలుతురును తట్టుకోలేవంటూ?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) తాజాగా మరోమారు విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నాగచైతన్య( Naga Chaitanya )ను నిందించేలా సమంత ఈ కామెంట్లు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

 Heroine Samantha Comments About Health Issues Details Here Goes Viral ,heroine S-TeluguStop.com

అయితే సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా కళ్లద్దాలు( Glasses ) పెట్టుకుని కనిపిస్తున్నారు.స్టైల్ కోసం సమంత కళ్లద్దాలు వాడుతున్నారని చాలామంది భావించారు.

అయితే సమంత మాత్రం తన ఆరోగ్య సమస్యల వల్లే కళ్లద్దాలను ధరిస్తున్నానని స్పష్టం చేశారు.నా కళ్లు వెలుతురును తట్టుకోలేవని ఆ రీజన్ వల్లే కళ్లద్దాలను ధరిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

తన లుక్స్ గురించి వస్తున్న కామెంట్ల గురించి కూడా సామ్ స్పందించారు.ఆరోగ్య సమస్యల వల్ల ఒక్కోసారి ఒక్కో లుక్ లో కనిపించడం జరుగుతుందని నా లుక్స్ గురించి ఎవరైనా నెగిటివ్ గా కామెంట్ చేసినా పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు.

నేను ఇప్పటికే ఎన్నో బాధలను అనుభవిస్తున్నానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.మరింత బ్యూటిఫుల్ గా కనిపించడం కోసం ఎంతగానో కష్టపడుతున్నానని సామ్ పేర్కొన్నారు.అయితే మయోసైటిస్ వ్యాధి వల్ల మెడికేషన్ వల్ల కొన్నిసార్లు నాపై నాకు కంట్రోల్ లేదని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు.కొన్నిసార్లు నేను బొద్దుగా కనిపిస్తానని మరి కొన్నిసార్లు నీరసంగా కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

నా కళ్లు వెలుతురిని తట్టుకోలేని పరిస్థితి వచ్చిందని మరే నటికి ఇలాంటి బాధ రాకూడదని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను బాధను అనుభవిస్తున్నానని గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.ఎన్నో దాటుకుని ఈ స్థాయికి వచ్చానని సమంత పేర్కొన్నారు.మరోవైపు కష్టానికి తగిన రెమ్యునరేషన్ ఇవ్వాలని సమంత తాజాగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సామ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube