ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అంచనాలు జోరందుకున్నాయి .గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన ఓటమిపై విశ్లేషణ చేసుకున్న వైసీపీ అధిష్టానం సామాజిక వర్గాల సమతుల్యత పాటించడంలో కొన్ని పొరపాట్లు జరిగాయని తద్వారా కొన్ని వర్గాలకు దూరమయ్యామని భావిస్తున్నారట .
ఇప్పుడు మరొకసారి క్యాబినెట్ విస్తరణ చేయడం ద్వారా దిద్దుబాటు చర్యలు చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.రెండోసారి క్యాబినెట్ విస్తరణ ద్వారా మంత్రి పదవి పొందిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా జగన్ ( YS Jagan )అంచనాలకు తగ్గట్టుగా పనిచేయడంలో విఫలమయ్యారని ఇప్పుడు వారిని ఇంటికి పంపనున్నారట .అంతేకాకుండా మొదటిసారి సమర్ధత నిరూపించుకున్న కొందరిని పక్కన పెట్టడం కూడా తప్పుడు సంకేతాలను పంపిందని వైసీపీ అధిష్టానం భావిస్తున్నదట.ఇప్పుడు లోపాలను సరి చేసుకొని సమర్థవంతమైన మంత్రివర్గాన్ని ఎన్నుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు అంటున్నాయి అంతేకాకుండా రోజురోజుకు తమ బలం నిరూపించుకుంటూ బలపడుతున్న జనసేన పార్టీ కి కాపు సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలబడుతుందని సర్వే రిపోర్ట్ వచ్చిందని, ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లను గెలుచుకునే విధంగా జనసేన పార్టీ( Janasena ) బలపడుతుందని ఆ రిపోర్టు సారాంశమట .
అందువల్ల ఆ సామాజిక వర్గ ఓట్లను చీల్చే విధంగా ఆ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న సంకేతాలు ఇవ్వడం కోసమే తోట త్రిమూర్తులు కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పేర్ని నాని( Perni Nani )కి కూడా మరొకసారి మంత్రి పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి .తద్వారా కాపు సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచి కొంత శాతాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని వైసీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటుందట.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై పార్టీలో చాలా అంతర్మదనం జరిగిందని, భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కూడా వాటిని ప్రజల్లో ప్రచారం చేయడంలో పార్టీ వెనుకబడిందని ఎన్నికలకు ఇంకా తక్కువ సమయమే ఉన్నందున అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మిగిలిన సమయం ఉపయోగించుకోవాలని, అలసత్వం ప్రదర్శించకూడదంటూ పార్టీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లుగా సమాచారం.